Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Viral Video: నేర్చుకోవాలనే తపన ఉంటే.. ఏదీ అడ్డుకాదు అని ఓ బామ్మ నిరూపించింది. 90 ఏళ్ల వయస్సులోనూ తన కోరికను నెరవేర్చుని..

Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Car
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2021 | 9:11 AM

Viral Video: నేర్చుకోవాలనే తపన ఉంటే.. ఏదీ అడ్డుకాదు అని ఓ బామ్మ నిరూపించింది. 90 ఏళ్ల వయస్సులోనూ తన కోరికను నెరవేర్చుని.. తాను అనుకున్నది సాధించి చూపించింది ఆ బామ్మ. సాధారణంగా 90 ఏళ్ల వయసున్న బామ్మ అంటే ఇంట్లో ముక్కుతూ మూలుగుతూ.. కృష్ణా, రామా అంటూ ఇంట్లో కూర్చుంటారు అని అనుకుంటాం. కానీ ఆ భావన పూర్తిగా తప్పు అని నిరూపించింది. ఈ బామ్మ.. 90 ఏళ్ల వయస్సులోనూ తనకు ఉన్న ఆసక్తిని వ్యక్తపరచడమే కాకుండా.. తన కోరిక మేరకు కారు డ్రైవింగ్ నేర్చుకుంది. కేవలం రోజుల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకుని హైవేపై రయ్‌మంటూ దూసుకెళ్లింది. బామ్మ కార్ డ్రైవింగ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఈ బామ్మకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయ. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన 90 ఏళ్ల బామ్మ రేష్మీ బాయ్ తన్వర్.. అందరిలాగే ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం లేదని భావించింది. కారు డ్రైవింగ్‌ పట్ల తనకు ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంలోనే కారు డ్రైవింగ్ క్లాస్‌లో చేరింది. కొద్ది రోజుల వ్యవధిలోనే డ్రైవింగ్ పూర్తిగా నేర్చేసుకుంది. ఈ క్రమంలోనే హైవేపై కారు డ్రైవింగ్ చేస్తూ తన కోరికను నెరవేర్చుకుంది. హైవేపై కారు డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఆ బామ్మ కళ్లలో ఆనందం వర్ణించలేనిది అని చెప్పాలి. అంతలా డ్రైవింగ్‌ను ఆస్వాదించింది ఆ బామ్మ. అయితే, రేష్మీ బాయ్ కారు డ్రైవింగ్ చేస్తుండగా.. స్థానిక వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సందీప్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

ఈ బామ్మ డ్రైవింగ్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా నెటిజన్లు ఫిదా అయిపోయారు. బామ్మ ప్రయత్నానికి సలాం కొడుతున్నారు. ఆమె ఆత్మవిశ్వాసం చాలా గొప్పదంటూ కితాబిస్తున్నారు. ఈ వీడియోను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా షేర్ చేశారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడారు. ‘ఆసక్తి ఉండాలే గానీ వయసుతో పనేముంది? ఎంత వయసు అయితే ఏంటి? అని ఈ బామ్మ నిరూపించింది అందరిలో స్ఫూర్తి నింపింది. ఏ వయసు వారైనా సరే జీవితాన్ని ఆస్వాధించాలనే అభిరుచి ఉండాలి’’ అని క్యాప్షన్ పెట్టారు. మరికొందరు నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ‘గ్రేట్.. నేను నా తల్లికి కూడా కారు డ్రైవింగ్ నేర్పించేందుకు ప్రయత్నిస్తాను.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఈ బామ్మ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..

కంటిలో నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. వైద్యులు చెప్పిన మాటలు విని షాక్..

Fuel Rates: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో.!

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్