Fuel Rates: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో.!

Petrol Diesel Rates Today: వాహనదారులకు ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల స్వల్పంగా పెరిగి.. ఆ తర్వాత..

Fuel Rates: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో.!
Petrol Diesel Rates
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2021 | 9:02 AM

వాహనదారులకు ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల స్వల్పంగా పెరిగి.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి.. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర సెంచరీ దాటగా.. డీజిల్ ధర వంద రూపాయలకు దగ్గరలో ఉంది. ఒకవైపు నిత్యావసర సరకులు, గ్యాస్ ధరలు పెరిగిపోవడం.. మరోవైపు చమురు ధరలు పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా శుక్రవారం (సెప్టెంబర్‌ 24) పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశంలో అక్కడక్కడ స్వల్ప మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.82 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.41గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96ఉండగా.. డీజిల్ ధర రూ.93.46గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.27 గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.92గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.44గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.08గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.74గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.35గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.62గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.33కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.42లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.45 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.63గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.21లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.33గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.33లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.42లకు లభిస్తోంది.

Also Read:

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!