Covid-19: కోవిడ్ బాధిత కుటుంబాలకు శుభవార్త.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ రూ.50వేలు పరిహారం!

Compensation for Covid 19 deaths: కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్ని ప్రాణాలు కోల్పోయిన వారిక కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

Covid-19: కోవిడ్ బాధిత కుటుంబాలకు శుభవార్త.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ రూ.50వేలు పరిహారం!
Supreme Court On Covid
Follow us

|

Updated on: Sep 24, 2021 | 8:52 AM

Corona Deaths Compensation: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలానికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అనాథలుగా మారారు. ఇటు భారత్‌లోనూ కరోనాతో వేలాది మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే వారిని అదుకునేందుకు పరిహారం అందజేయాలనే డిమాండ్ వినిపింది. దీంతో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ పరిహారాన్ని రాష్ట్రాలు.. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ నుంచి చెల్లించాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది.

కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్ని ప్రాణాలు కోల్పోయిన వారిక కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారని, అవి పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో కరోనాతో మరణించినవారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, కరోనా సోకడంతో ఆందోళన చెందిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలు కూడా పరిహారం పొందేందుకు అర్హలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కోవిడ్ పాజటివ్ రిపోర్ట్ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు పరిహారం పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. దీంతో కరోనా పాజటివ్‌గా తేలడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా రూ. 50వేల పరిహారం అందించనున్నట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది.

ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం అఫిడవిట్ దాఖలుచేసింది. ‘‘కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద పరిహారం పొందడానికి అర్హులే. ఈమేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చు’’ అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతిచ్చినట్లు కేంద్రం బుధవారం కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ వర్తించనుంది.

కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు 30 రోజుల్లోగా పరిహారం అందుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం బాధిత కుటుంబాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి.. ఈ కమిటీ చేసే సిఫార్సు మేరకు పరిహరం చెల్లించనున్నారు.

Read Also….  Funny Moments in Assembly: అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా జారిపోయిన మాజీ సీఎం పంచె.. సభలో నవ్వులే నవ్వులు..