India Corona Updates: దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు.. తాజా లెక్కలు ఇవే..
India Corona Cases: దేశంలో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 33,594,803 కి చేరింది.
India Corona Cases: దేశంలో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 33,594,803 కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గణాంకాలతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,46,368 కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 32,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,00,162 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. సీరియస్‌గా ఉన్న కొద్ది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది.
దేశంలో నిన్న ఒక్క రోజు 15,65,696 శాంపిల్ పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 55,99,32,709 శాంపిల్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. గురువారం ఒక్క రోజులు 72,20,642 వ్యాక్సీన్లు వేయగా.. ఇప్పటి వరకు 84,15,18,026 వ్యాక్సీన్ డోస్‌లు వేశారు. కరోనా కట్టడికి వ్యాక్సీనేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
కాగా, ఒక్క రోజులు దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి. కేరళలలో 19,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో రోజూ కనీసం 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండటం కలవరానికి గురి చేస్తోంది.
సంక్షిప్తంగా కరోనా వివరాలు.. మొత్తం కేసులు: 3,35,94,803 యాక్టివ్ కేసులు: 3,00,162 మొత్తం రికవరీ: 3,28,48,273 మొత్తం మరణాలు: 4,46,368 మొత్తం టీకాలు : 84,15,18,026
India reports 31,382 new COVID cases, 32,542 recoveries, and 318 deaths in the past 24 hours
Active cases: 3,00,162 Total recoveries: 3,28,48,273 Death toll: 4,46,368
Vaccination: 84,15,18,026 (72,20,642 in the last 24 hours) pic.twitter.com/GMvxUehKwc
— ANI (@ANI) September 24, 2021
Also read:
Hair Cut: జట్టు కత్తిరించినందుకు హెయిర్ సెలూన్‌కు రూ. 2 కోట్ల జరిమానా.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..