Jagga Reddy: కాంగ్రెస్ పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా?.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీనియర్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీలో తనను గౌరవించడం లేదని మండిపడ్డారు. పార్టీ మారాలంటే తనను ఆపేది ఎవరని ప్రశ్నించారు.

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా?.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Mla Jaggareddy
Follow us

|

Updated on: Sep 24, 2021 | 1:00 PM

MLA Jagga Reddy fire on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీనియర్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీలో తనను గౌరవించడం లేదని మండిపడ్డారు. పార్టీ మారాలంటే తనను ఆపేది ఎవరని ప్రశ్నించారు. అయినా పార్టీలో తనను మాట్లాడనివ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్‌గా మాట్లాడారు జగ్గారెడ్డి. అసలు పార్టీలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పార్టీలో అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్‌మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని కొందరి తీరుపై మండిపడ్డారు. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదని, రాష్ట్రంలో తనకు కూడా అభిమానులు ఉన్నారని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తనను గౌరవించడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్‌మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని కొందరి తీరుపై మండిపడ్డారు. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదని, రాష్ట్రంలో తనకు కూడా అభిమానులు ఉన్నారని చెప్పారు. పార్టీ మద్దతు లేకుండానే 2 లక్షల మందితో సభ పెడతానన్నారు. కాంగ్రెస్‌లో సింగిల్‌ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్‌ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటని రేవంత్‌ రెడ్డి తీరును ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్‌ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా్కు పీసీసీ అధ్యక్షుడు వస్తే .. నాకు సమాచారం ఇ‍వ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్‌ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి, రేవంత్‌ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. కాగా, ఎథిక్స్‌కి కట్టుబడి.. తాను కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పనిచేయాలని అన్నారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ​

Read Also…  Chiranjeevi-Nagarjuna: కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన మూవీలో చిరు-నాగ్‌లు.. ఇదే నిజమైతే దక్షిణాదిలో మెగా మల్టీస్టార్‌గా చరిత్ర