Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌!

తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది.

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌!
Errebelli Car Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 24, 2021 | 1:34 PM

Minister Errabelli Dayakar Rao: తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కాన్వాయ్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. యాదాద్రి కలెక్టరేట్ సమీపంలో మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన చెట్టపొదల్లో కిందపడిపోయారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంత్రి స్వయంగా తన కాన్వాయ్‌లోని మరో కారులో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. అనంతరం మంత్రి అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. గతంలో​ఎర్రబెల్లి దయాకర్‌ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

Read Also.. Telugu CM’s Delhi Visit: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్ జగన్.. ఈ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన బాట

JC Diwakar Reddy: ఆంధ్ర వదిలేసి తెలంగాణకు వస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి