Telugu CM’s Delhi Visit: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్ జగన్.. ఈ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన బాట

ఏపీ సీఎం జగన్‌ రేపు ఢిల్లీ వెళతారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది

Telugu CM's Delhi Visit: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్ జగన్.. ఈ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన బాట
Kcr Jagan
Follow us

|

Updated on: Sep 24, 2021 | 1:31 PM

CM Jagan – CM KCR: ఏపీ సీఎం జగన్‌ రేపు ఢిల్లీ వెళతారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి హాజరవుతారు ముఖ్యమంత్రి జగన్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం ఈ భేటీకి హాజరవుతారు. ఈ సాయంత్రమే కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్​అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా హోం శాఖ ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు.

ఇదిలావుంటే, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది.

Read also:  YSR Statue: చిత్తూరు జిల్లాలో కలకలం.. వైయస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు