Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలకు ఛాన్స్..

AP Weather Alert: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని అమరావతి

AP Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలకు ఛాన్స్..
Ap Weather
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2021 | 2:28 PM

AP Weather Alert: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇదికాస్తా రాగల 12 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందన్నారు.ఆ తరువాత 48 గంటలలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య విస్తరించి ఉందన్నారు.

ఇక రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ బలహీనపడిందని అధికారులు తెలిపారు. అలాగే.. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడిన ‘ఉపరితల ఆవర్తనం’ బలహీనపడిందన్నారు.

ఇదిలాఉంటే.. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం అధికారులు.. ఆ మేరకు రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను ప్రకటించారు. దీని ప్రకారం.. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. శనివారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం నాడు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆ రోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీవర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు(శనివారం) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉంది.ఆదివారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుందన్నారు. ఇవాళ రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం నాడు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Also read:

Ice Age: మానవ మనుగడకు సంబంధించి వెలుగులోకి సంచలన నిజాలు.. వెల్లడించిన సైంటిస్టులు

Viral Video: ఆ గేదె టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే .. ఈ వీడియో చూస్తే నోరెళ్లబడతారు..!

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా?.. పురుషులకు పిడుగులాంటి వార్త..!