Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా?.. పురుషులకు పిడుగులాంటి వార్త..!

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా? ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారా? అయితే షాకింగ్ వార్త మీకోసమే.

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా?.. పురుషులకు పిడుగులాంటి వార్త..!
Corona
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2021 | 1:21 PM

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా? ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారా? అయితే షాకింగ్ వార్త మీకోసమే. ముఖ్యంగా ఇది పురుషులకు పిడుగులాంటి వార్త. గీత 40 సంవత్సరాల కాలంలో తొలిసారి పురుషుల ఆయుర్ధాయం క్షీణించింది. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఓ అధ్యయన సంస్థ గుర్తించింది. కరోనా వైరస్ కారణంగా ఈ మార్పు సంభవిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఒక సంవత్సరంలోనే ప్రంపచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది జనాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా లండన్‌లో జరిపిన అధ్యయనంలో.. పురుషుల ఆయుర్ధాయం కూడా తగ్గినట్లు గుర్తించారు.

‘‘గత 40 సంవత్సరాలలో యూకీలోని పురుషుల్లో ఆయుర్దాయం ఘణనీయంగా పెరిగింది. కానీ, దశాబ్ద కాలంగా ఆ పరిస్థితి రివర్స్ అవుతూ వస్తోంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి.’’ అని వృద్ధాప్య, జనాభా అంచనా సంస్థ ఏఎన్ఎస్ ప్రతినిథి పమేలా కాబ్ తెలిపారు. తాజాగా అంచనాల ప్రకారం పురుషుల ఆయుర్దాయం 2012 నుంచి 2014 స్థాయికి పడిపోయిందన్నారు. అయితే, మహిళ ఆయుర్దాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు

కోవిడ్ మహమ్మారికి ముందు అంటే 2015 నుంచి 2017 మధ్య జన్మించిన మగ శిశువు ఆయుర్దాయం 79.2 సంవత్సరాలుగా పేర్కొన్నారు. 2018 నుంచి 2020 మధ్య జన్మించిన శిశువు ఆయుర్దాయం 70 ఏళ్లకు పడిపోయిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఇక మహిళల ఆయుర్దాయం అలాగే ఉందని తెలిపారు. 2015 – 2017, 2018 – 2020 మధ్య జన్మించిన ఆడ శిశువుల ఆయుర్దాయం 89.2 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

ఏదేమైనా.. 2018 – 2020 మధ్య జన్మించిన అబ్బాయిల జీవితకాలం చాలా తక్కువగా ఉందని అన్నారు. అయితే, ఈ అంచనా తప్పనిసరి కాదని నిపుణులు తెలిపారు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత పరిస్థితి మారే ఛాన్స్ కూడా ఉందని తెలిపారు.

Also read:

Chanakya Niti: వీటిని పాటిస్తే ఎలాంటి వారినైనా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. నీతిశాస్త్రంలోని ఆసక్తికర విషయాలు మీకోసం..

Yoga Asanas: మెడ నొప్పి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా? ఈ మూడు ఆసనాలతో ఉపశమనం పొందండి..

Anti Tobacco: ఆ యాడ్ నుంచి తప్పుకోండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు టొబాకో ఆర్గనైజేషన్ లేఖ..