AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ గేదె టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే .. ఈ వీడియో చూస్తే నోరెళ్లబడతారు..!

Viral Video: ప్రతీ వ్యక్తిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అయితే, గుర్తించిన వారే బయట ప్రపంచానికి గుర్తుంటారు. లేదంటే.. బావిలో కప్పలా బతికేయాల్సింది.

Viral Video: ఆ గేదె టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే .. ఈ వీడియో చూస్తే నోరెళ్లబడతారు..!
Buffalo
Shiva Prajapati
|

Updated on: Sep 24, 2021 | 1:41 PM

Share

Viral Video: ప్రతీ వ్యక్తిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అయితే, గుర్తించిన వారే బయట ప్రపంచానికి గుర్తుంటారు. లేదంటే.. బావిలో కప్పలా బతికేయాల్సింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగా ఇట్టే తెలిసిపోతుంది. సమాచార మార్పిడి అత్యంత వేగంగా జరిగిపోతోంది. ఇదే సమయంలో వ్యక్తుల్లోనూ ట్యాలెంట్ కూడా బయటపడుతోంది. వీడియో యాప్స్, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ద్వారా వ్యక్తులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ వచ్చాక.. ప్రతీ ఒక్కరూ ఈ వీడియో షేరింగ్ యాప్ ద్వారా తమలోని ట్యాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. టిక్‌టాక్‌ను అనుసరిస్తూ.. ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్, మోజ్ వంటి అనేక వీడియో షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే, ఇప్పటి వరకు మనం మనుషుల్లో ఉండే టాలెంట్ గురించి మాట్లాడుకున్నారం. మరి. జంతువులకు కూడా టాలెంట్ ఉంటదని మీకు తెలుసా? వాటిలో ఉండే అసాధారణమైన ప్రతిభను మీరెప్పుడైనా గుర్తించారా? అయితే, ఈ గేదె టాలెంట్‌ను చూడాల్సిందే. అది చేసిన పని చూస్తే.. బాప్‌రే ఏందిరా అయ్యా ఇది నోరెళ్లబెట్టి చూస్తారంతే. ఆ గేదె టాలెంట్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ గేదె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోలో గేదెను ఓ దుంగకు కట్టేశారు. అయితే, దానికి మేత వేయడానికి ఉపయోగించే టబ్‌ను గేదె తన కొమ్ముతో గిరా గిరా తిప్పేసింది. ఎలాగంటే.. ఫుల్‌బాల్, వాలిబాల్‌ని మనం చేతి వేలిపై ఎలాగైతె తిప్పుతామో.. ఆ గేదె కూడా అచ్చంగా అలాగే తన కొమ్ముతో టబ్‌ని ఓ రేంజ్‌లో తిప్పింది. లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి తిప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే, గేదె తన కొమ్ముతో టబ్‌ను తిప్పడాన్ని ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బందించాడు. ఆ తరువాత ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇది నెటిజన్ల షాక్ అవుతున్నారు. ఏం స్టంట్ రా అయ్యా ఇది అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

Viral Video:

Also read:

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా?.. పురుషులకు పిడుగులాంటి వార్త..!

Chanakya Niti: వీటిని పాటిస్తే ఎలాంటి వారినైనా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. నీతిశాస్త్రంలోని ఆసక్తికర విషయాలు మీకోసం..

Yoga Asanas: మెడ నొప్పి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా? ఈ మూడు ఆసనాలతో ఉపశమనం పొందండి..