JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

సీఎల్‌పీ వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డికి క్లాస్‌ పీకారు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి. ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే సీఎల్‌పీ బయటే చూసుకోవాలన్నారు. ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి.

JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
Mlc Jeevan And Jc
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 24, 2021 | 4:32 PM

సీఎల్‌పీ వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డికి క్లాస్‌ పీకారు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి. ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే సీఎల్‌పీ బయటే చూసుకోవాలన్నారు. ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి. ప్రతిసారీ ఇదో అలవాటైపోయిందని టి. జీవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న జేసీ.. జీవన్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. సారీ.. చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా ఉంటే సీఎల్‌పీ బయట మాట్లాడుకోవాలని చాలా గట్టిగానే చెప్పారు టి.జీవన్‌రెడ్డి. కొంత ఇబ్బందికి గురైన జేసీ దివాకర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు.

అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్‌పీకి వచ్చారు. తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. అక్కడి నుంచి సీఎం చాంబర్‌కు వెళ్లి విష్‌ చేసి వచ్చారు.

ఆ తర్వాత మీడియాతో..

తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి. ఆంధ్రను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్పీకి వచ్చారు జేసీ దివాకర్‌రెడ్డి. తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు జేసీ.

తెలంగాణ అసెంబ్లీకి సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు. మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు.

నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవని జేసీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: TTD: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దు.. టీటీడీ వెబ్‌సైట్‌పై వివరణ ఇచ్చిన టీటీడీ..

Mashup: ‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్.. నెక్ట్స్ లెవల్ అంతే

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే