Lungs Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేశారో ప్రాణాలకే ముప్పు..
Lungs Health: చాలామంది ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చిన్నదే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ అలాంటి చిన్నవే ప్రాణాంతకంగా
Lungs Health: చాలామంది ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చిన్నదే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ అలాంటి చిన్నవే ప్రాణాంతకంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నమైనవని, వాటిపట్ల అలసత్వం అస్సలు వహించకూడదని అంటున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించి.. అంతర్లీన అనారోగ్య పరిస్థితిని సూచించే కొన్ని స్వల్ప లక్షణాలు ఉంటాయని, వాటిని చాలామంది గుర్తించరని అన్నారు. కానీ, వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు లవ్‌నీత్ బాత్రా. అలాంటి ఉపద్రవం నుంచి బయటపడేందుకు.. ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టాలో తెలిపారు. ఈ మేరకు కొన్ని ప్రమాకరమైన లక్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఛాతి నొప్పి,, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక శ్లేష్మం.. శ్లేష్మం, కఫం. ఇది అంటువ్యాధుల కారణంగా వస్తుంది. శ్లేష్మం ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వస్తున్నట్లయితే.. ఊపిరితిత్తులు వ్యాధి బారిన పడినట్లే అని తెలుసుకోవాలి.
View this post on Instagram
ఆకస్మికంగా బరువు తగ్గడం.. డైటింగ్, వ్యాయామం చేయకుండానే మీ శరీర బరువు తగ్గుతున్నట్లయితే.. అనారోగ్యానికి గురవుతున్నట్లే అని గుర్తించాలి. ఇది శరీరం పంపుతున్న సంకేతంగా భావించాలని బాత్రా పేర్కొన్నారు.
శ్వాసలో మార్పు.. మీరు శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్నా, వెంటనే వెంటనే ఊపిరి పీల్చుకున్నా.. అది ఊపిరి తిత్తులు వ్యాధి బారినపడిట్లు గుర్తించాలి. ఊపిరితిత్తులలో కణితి, కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
రక్త చారలతో కూడిన నిరంతర దగ్గు.. మీకు ఎనిమిది వారాలు, అంతకంటే ఎక్కువ కాలం పాటు రక్త చారలతో కూడిన దగ్గు వస్తున్నట్లయితే.. దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించబడుతుంది. శ్వాసకోస వ్యవస్థలో ఏదో తేడా జరుగుతుందని వెంటనే గమనించాలి. లేదంటే ముప్పు తప్పదని బాత్రా హెచ్చరించారు.
‘ఈ సంకేతాలన్నీ మీ శరీరంలో గమనించినట్లయితే.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకండి. అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.’ అని లవ్‌నీత్ బాత్రా తెలిపారు.
Also read:
Monkey Revenge: విలన్‌గా మారిన కోతి.. రివేంజ్ తీర్చుకోవడానికి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించింది..
Beauty Tips For Skin: మొటిమలు, మచ్చలు లేని ముఖారవిందం కావాలా? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి..