Jowar Vegetable Biryani: జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలు బెస్ట్, జొన్న బిర్యాని తయారీ ఎలా అంటే

Jowar Vegetable Biryani: చిరుధాన్యాల్లో ఒకటి జొన్నలు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలోని 500 మినియన్ల ప్రజలు ఆహార ధాన్యంగా ఉపయోగిస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం కొంత కాలం..

Jowar Vegetable Biryani: జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలు బెస్ట్, జొన్న బిర్యాని తయారీ ఎలా అంటే
Jowar Biryani
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2021 | 4:22 PM

Jowar Vegetable Biryani: చిరుధాన్యాల్లో ఒకటి జొన్నలు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలోని 500 మినియన్ల ప్రజలు ఆహార ధాన్యంగా ఉపయోగిస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం కొంత కాలం క్రితం వరకూ జొన్నలను కొన్ని ప్రాంతాలవారు మాత్రమే తినేవారు. రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తున్న జొన్నల వాడకం గత కొంతకాలంగా పెరిగింది. జొన్నల్లో గ్లూటెన్ లేకపోవడంతో ఎక్కువమంది గోధుమలు బదులుగా జొన్నలను ఆహారంగా ఎంచుకుంటున్నారు.  దీంతో జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్న పంటను అధికంగా పండిస్తారు. ఇక ఈ జొన్నలతో రొట్టెలనే కాదు పేలాలు, పేలాలు లడ్డు, అప్పడాలు, అంబలి, బిర్యానీ వంటి ఎన్నో రుచికమైన ఆహారపదార్ధాలను తయారు చేస్తున్నారు. ఈరోజు జొన్నల బిర్యానీ తయారీ.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

జొన్న రవ్వ – ఒక గ్లాసు పచ్చి బఠానీలు – 50గ్రా బంగాళ దుంపలు  -4 ​క్యారెట్లు -4 ఉల్లిపాయలు -2 కొత్తిమీర -2కట్టలు పుదీన  -2కట్టలు అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్ యాలకులు-3

లవంగాలు-2 దాల్చిన చెక్క-3చిన్న ముక్కలు ఉప్పు – రుచికి సరిపడా నూనె – మూడు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ నీరు – జొన్న రవ్వ తీసుకున్న గ్లాస్ కు మూడు రేట్లు జీడిపప్పు

తయారు విధానం: ముందు కూరగాయలను శుభ్రంగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి.. నూనె నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో పెన చెప్పిన మసాలా దినుసులు, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠానీలు, కూరగాయ ముక్కలు, జీడిపప్పు వేసుకుని వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అందులో కొలతగా తీసుకున్న నీరు పోయాలి. నీళ్ళు మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పువేసుకుని జొన్న రవ్వ వేసుకోవాలి. సన్నటి సెగపై ఉడికించాలి. దించేముందు కొత్తిమీర, పుదీనాను వేసుకుని కలిపితే.. టేస్టీ టేస్టీ జొన్న రవ్వ బిర్యానీ రెడీ

ఆరోగ్య ప్రయోజలు:

జొన్నలు చాలా బలవర్ధకమైన అహారం. ఈ జొన్నల్లో శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి సహాయం చేసే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి అనేక సూక్ష్మపోషకాలు ఉన్నాయి. ఎముక పుష్టి చేస్తుంది. జొన్నలతో  చేసిన వంటలు సులభంగా అరగుతాయి. అందుకని బరువు పెరగకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.  జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. పోషక విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

Also Read: K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..

అదే పనిగా కంప్యూటర్‌ చూస్తున్నారా.? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. వాటి నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌..