Health: అదే పనిగా కంప్యూటర్‌ చూస్తున్నారా.? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. వాటి నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌..

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ఎంతగానో మారింది. ప్రస్తుతం కంప్యూటర్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్‌ విషయంలో కూడా...

Health: అదే పనిగా కంప్యూటర్‌ చూస్తున్నారా.? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. వాటి నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 6:40 AM

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ఎంతగానో మారింది. ప్రస్తుతం కంప్యూటర్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్‌ విషయంలో కూడా కంప్యూటర్‌ వాడకం అనివార్యంగా మారింది. ఇక గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చునే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతోన్న పనితీరుకు తగ్గట్లు మారక తప్పని పరిస్థితి. దీంతో గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అదే పనిగా కంప్యూటర్‌ చూసే వారిలో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ అనే సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కంప్యూటర్‌ ముందు కూర్చొనే విధానం, చుట్టుపక్కల ఉన్న లైటింగ్‌, అదే విధంగా అంతకు ముందు ఉన్న కంటి సమస్యల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిలో ప్రధానమైనవి.. తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, కళ్లు పొడిగా మారడం, కంటిపై ఒత్తిడి, కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో దురద వంటి సమస్యలు ఇటీవల తరచుగా వస్తున్నాయి. మరి ఈ సమస్యలకు చెక్‌ పెట్టలేమా అంటే.. కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా కచ్చితంగా పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. కంప్యూటర్‌ ముందు కూర్చొవడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొవడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్‌ ఇప్పుడు చూద్దాం..

* కంప్యూటర్‌ స్క్రీన్‌ను అదేపనిగా చూడకూడదు. అప్పుడప్పుడు చూపును పక్కను మారుస్తూ ఉండాలి. అలాగే కంటి రెప్పలను కొడుతూ ఉండాలి. దీనివల్ల కళ్లు పూర్తిగా పొడిగా మారకుండా తేమతో ఉంటాయి.

* కళ్లకు అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. కనీసం 30 నిమిషాలకొకసారైనా రెండు కళ్లను గట్టిగా మూసుకొని గుండెల నిండా గాలిని పీల్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.

* ఇక మీ కంప్యూటర్‌ గదిలో ఉండే వాతావరణంపై ప్రత్యేక శ్రద్ధతో ఉండాలి. ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న రోజుల్లో ఇంట్లో మంచి వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వెలుతురు, గాలి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

* కంప్యూటర్‌ ముందు సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఎలా పడితే అలా కూర్చుంటో నడుము, మెడ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వెన్నుముకను నిటారుగా ఉంచుతూ కూర్చోవాలి.

* వీటితో పాటు వ్యాయామాన్ని దిన చర్యలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా నడుము, మెడకు సంబంధించిన వర్కవుట్లను చేస్తూ ఉండాలి. ఈ టిప్స్‌ పాటించడం ద్వారా కంప్యూటర్‌ వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు.

Also Read: Vitamin D: మీ నాలుక, నోట్లో ఈ లక్షణాలుంటే విటమిన్‌ డి లోపం ఉన్నట్లు..! తెలుసుకోండి..

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 వస్తువులు ఎప్పుడు అయిపోకూడదు..! ఎందుకంటే..?

వైరల్‌ ఫీవర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఈ 3 పానీయాలు తప్పనిసరి..! అవేంటంటే..?