Malaria: జ్వరంతో బాధపడుతున్నారా.. మలేరియా అని అనుమానం ఉందా.. అయితే మీలో లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి..

Malaria: ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ల కాలం నడుస్తోంది. మొన్నటి వరకు కరోనాతో భయపడ్డవారంతా ఇప్పుడు వైరల్‌ ఫీవర్స్‌తో వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆసుపత్రి చూసినా పేషేంట్స్‌తో...

Malaria: జ్వరంతో బాధపడుతున్నారా.. మలేరియా అని  అనుమానం ఉందా.. అయితే మీలో లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 6:40 AM

Malaria: ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ల కాలం నడుస్తోంది. మొన్నటి వరకు కరోనాతో భయపడ్డవారంతా ఇప్పుడు వైరల్‌ ఫీవర్స్‌తో వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆసుపత్రి చూసినా పేషేంట్స్‌తో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెంగ్యూతో పాటు మలేరియా కూడా ఎక్కువగా వ్యాపిస్తోంది. మరి అసలే ఫీవర్‌ కాలం ఈ సమయంలో మనకు వచ్చింది మాములు జ్వరమా.? లేదా మలేరియానో తెలయని సంశయంలో ఉన్నారా.? ఇంతకీ మలేరియా ఎలా వస్తుంది.? వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

* సాధారణంగా మలేరియా వ్యాధి దోమ‌ల వ‌ల్ల ఎక్కువ‌గా వ‌స్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుడితే మ‌లేరియా వ్యాప్తి చెందుతుంది. మ‌లేరియా ఉన్న దోమ కుడితే మ‌న‌కు మ‌లేరియా వ‌స్తుంది.

* మలేరియా వ్యాధి సోకిన వారికి తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కొందరికి జ్వరంతో పాటు భరించలేని నొప్పి వస్తుంది.

* ఇక ఈ వ్యాధి సోకిన వారికి వాతావరణం వేడిగా ఉన్నా విపరీతంగా చలి ఉంటుంది. ఎన్ని బ్లాంకెట్లు కప్పుకున్నా చలి ఆగదు, వణికి పోతుంటారు. ముఖ్యంగా సాయంత్రం కాగానే ఈ చలి ప్రారంభమవుతుంది.

* మలేరియా వచ్చిన వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం విపరీతమైన చెమట రావడం. వాతావరం చల్లగా ఉన్న చెమట వస్తుంది.

* ఇక ఈ వ్యాధితో బాధపడేవారిలో ఆకలి ఉండదు. త్వరగా ఆలసిపోతుంటారు. డీ హైడ్రేషన్‌ కారణంగా నీరసంగా అవుతారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* మలేరియా సోకిన వారిలో కొందరికి వామ్టింగ్‌ సెన్సేషన్ (వాంతి వచ్చినట్లు) అనిపిస్తుంది. కడుపులో వికారం, ఏది తిన్నా వాంతి వస్తున్న భావన కలుగుతుంది.

* వీటితో పాటు పొడి దగ్గు, కండ‌రాల నొప్పులు కూడా మ‌లేరియా వ‌చ్చిన వారిలో క‌నిపిస్తుంటాయి. ఈ ల‌క్షణాలు ఉంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా డాక్టర్‌ను సంప్రదించి వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి.

Also Read: Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..

Eye Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టడం ఎలా..? అద్భుతమైన చిట్కాలు..!

Usage of Ear Buds: మీరు ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే ప్రమాదమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!