AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: మీ నాలుక, నోట్లో ఈ లక్షణాలుంటే విటమిన్‌ డి లోపం ఉన్నట్లు..! తెలుసుకోండి..

Vitamin D: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌ డి తప్పనిసరి. ఇది సూర్యకాంతి వల్ల లభిస్తుంది. తక్కువ పరిమాణంలో ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే చాలామంది

Vitamin D: మీ నాలుక, నోట్లో ఈ లక్షణాలుంటే విటమిన్‌ డి లోపం ఉన్నట్లు..! తెలుసుకోండి..
Vitamin D
uppula Raju
|

Updated on: Sep 24, 2021 | 4:27 PM

Share

Vitamin D: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌ డి తప్పనిసరి. ఇది సూర్యకాంతి వల్ల లభిస్తుంది. తక్కువ పరిమాణంలో ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతారు. మన ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా విటమిన్ డి లోపం రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు. కానీ ఇప్పుడు పరిశోధకులు మరొక సులభమైన మార్గాన్ని కనుగొన్నారు. నాలుకను పరిశీలించడం ద్వారా కూడా ఈ లోపాన్ని తెలుసుకుంటున్నారు.

2017లో డెర్మటాలజీ విభాగం మాయో క్లినిక్, రోచెస్టర్ (USA) నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (BMS) లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు తేల్చింది. బర్నింగ్ టంగ్ సిండ్రోమ్ అంటే నాలుక కాలినట్టు అనిపించడం. నోరు, నాలుక, పెదాలు మంట అవుతున్న ఫీలింగ్ తోపాటు, ఎక్కువగా దప్పిక అవడం, నోరు తడి ఆరిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. పంటి సమస్యలు, బ్యాడ్ బ్రీత్ కి కారణమవుతాయి. ఈ లక్షణాలు ఉన్నవారు విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నట్లుగా చెప్పారు.

విటమిన్ డి ఎలా లభిస్తుంది.. ప్రతిరోజూ సూర్యకాంతిలో కొంత సమయం గడపడం ద్వారా మీ శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి అందుతుంది. వసంత రుతువు, వేసవికాలంలో 10 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుంది. అయితే చలికాలంలో విటమిన్ డి పొందడానికి కనీసం 2 గంటలు గడపవలసి ఉంటుంది.

విటమిన్ డి ఇతర వనరులు సూర్యకాంతి అనేది విటమిన్ డికి ఉత్తమ మూలం. కానీ మీరు దీనిని ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఈ పదార్థాలు తినవచ్చు. పాలకూర, కాలేయం, ఓక్రా, సోయాబీన్స్, వైట్ బీన్స్, సార్డినెస్, సాల్మన్ చేపలలో ఎక్కువగా లభిస్తుంది.

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

Moon Tourism: ఇక చందమామపైకి వెళ్లి కాఫీ తాగి రావచ్చు.. మూన్ టూరిజం గేట్లు తెరిచిన కంపెనీలు!

YSR Aarogyasri: ‘డెంగ్యూ’ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉందా..? లేదా..? ఏపీ ఆస్పత్రుల్లో వింత పరిస్థితులు