Tips To Reduce Uneasiness Video: ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువే లాగించారా? పొట్ట ఉబ్బరానికి ఇలా చెక్ పెట్టండి..!(వీడియో)

Tips To Reduce Uneasiness Video: ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువే లాగించారా? పొట్ట ఉబ్బరానికి ఇలా చెక్ పెట్టండి..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 25, 2021 | 5:51 PM

చోళె భతురె నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు... నోటికి ఎంతో రుచిగా, జర్రున పొట్టలోకి జారిపోయి సంతృప్తినిచ్చే అనేక ఆహారాలను .. చాలా ఇష్టంగా.. ఇంకా చెప్పాలంటే కాస్త గట్టిగానే లాగిస్తాం. ఇక ఆ తరువాతే మొదలవుతుంది అసలు కథ....

చోళె భతురె నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు… నోటికి ఎంతో రుచిగా, జర్రున పొట్టలోకి జారిపోయి సంతృప్తినిచ్చే అనేక ఆహారాలను .. చాలా ఇష్టంగా.. ఇంకా చెప్పాలంటే కాస్త గట్టిగానే లాగిస్తాం. ఇక ఆ తరువాతే మొదలవుతుంది అసలు కథ. పొట్టలో ఇబ్బంది, గందరగోళంగా, అనీజీగా ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే… పొట్ట గందరగోళం, అనీజీ నుంచి బయటపడొచ్చు.

భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. గోరువెచ్చని నీరు పోషకాలను జీర్ణమయ్యే రూపంలో విచ్ఛిన్నం చేస్తుంది మీకు తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఆయిలీ ఫుడ్‌ తిన్న తర్వాత శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపడానికి నిమ్మకాయ రసం డిటాక్స్‌ డ్రింక్‌లా సహాయపడుతుంది.బిర్యానీ లేదా ఆయిలీ ఫుడ్‌తో భారీ భోజనం తరువాత కాసేపు నడక చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 20 నిమిషాల నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు పొట్ట బరువుగా లేకుండా చేస్తుంది. హెవీ మీల్‌ తరువాత అరగంటకు ప్రోబయోటిక్‌ ఫుడ్‌ తీసుకోంఇ. మనకు తేలిగ్గా అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన ప్రోబయోటిక్ పెరుగు మన గట్ ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. .

హెవీగా తిన్న గంట తరువాత పండ్లు తినడం మరో మంచి ఆప్షన్. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు జీర్ణక్రియను పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఒక్క భోజనం చాలా హెవీగా చేసినట్టు అనిపిస్తే.. మీ నెక్ట్స్ రెండు మీల్స్ లో చాలా తేలిగ్గా, సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోండి.

మరిన్ని చదవండి ఇక్కడ : Woman behind DRDO leaks: డీఆర్‌డీఓ సీక్రెట్స్ లీక్‌లో మహిళ హస్తం..! విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు..(వీడియో)

 Australia Earthquake Video: మంచులో స్కేటింగ్‌ చేస్తుండగా భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో..

 Super Robo Video: సూపర్‌ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్‌ యువతులు..!(వీడియో)

 Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్…(వీడియో)