Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman behind DRDO leaks: డీఆర్‌డీఓ సీక్రెట్స్ లీక్‌లో మహిళ హస్తం..! విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు..(వీడియో)

Woman behind DRDO leaks: డీఆర్‌డీఓ సీక్రెట్స్ లీక్‌లో మహిళ హస్తం..! విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 25, 2021 | 5:46 PM

ఒడిశాలోని డీఆర్‌డీఓ రహస్యాల లీక్‌ ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికే అరెస్టు చేసిన అయిదుగురిని ఒడిశా క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఏడీజీ సంజీబ్‌ పండా మీడియాతో మాట్లాడుతూ..

ఒడిశాలోని డీఆర్‌డీఓ రహస్యాల లీక్‌ ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికే అరెస్టు చేసిన అయిదుగురిని ఒడిశా క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఏడీజీ సంజీబ్‌ పండా మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్‌ నుంచి 38,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. నిందితులు ఓ మహిళతో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేశారని ఆమె యూకేకు చెందిన సెల్‌ఫోన్‌ నంబరు ద్వారా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో సంభాషించిందని అన్నారు.

కాగా ఆమె ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హ్యాండ్‌లర్లతో పరిచయం ఏర్పడి, హ్యాండ్‌లర్లకు రహస్యాలు పంపాలని ఈ అయిదుగురు డీల్‌ కుదుర్చుకున్నారని చెప్పారు. సదరు మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో ఛాటింగ్‌ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితుల సోల్‌ఫోన్లలో వివరాలను తెలుసుకోవడానికి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో భారత వైమానిక దళానికి చెందిన అధికారులు కటక్‌ చేరుకొని రెండు రోజులపాటు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Australia Earthquake Video: మంచులో స్కేటింగ్‌ చేస్తుండగా భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో..

 Super Robo Video: సూపర్‌ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్‌ యువతులు..!(వీడియో)

 Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్…(వీడియో)

 IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)