Mini Israel of India: మన దేశంలోని ఓ గ్రామం ఇజ్రాయిల్ వారికి పర్మినెంట్ టూరిస్ట్ స్పాట్.. అందుకే మినీ ఇజ్రాయిల్‌గా ఫేమస్
Kasol-Little Israel: భారత దేశానికి ఇజ్రాయిల్ మంచి మిత్రుడు అన్న సంగతి తెలిసిందే.. భారత్ ను సందర్శించాడనికి ఇజ్రాయిల్ వారు ఎంతో ఇష్టపడతారు. అంతేకాదు తమకు వీలైనప్పుడు..
Mini Israel of India: భారత దేశానికి ఇజ్రాయిల్ మంచి మిత్రుడు అన్న సంగతి తెలిసిందే.. భారత్ ను సందర్శించాడనికి ఇజ్రాయిల్ వారు ఎంతో ఇష్టపడతారు. అంతేకాదు తమకు వీలైనప్పుడు ఇజ్రాయిల్ దేశం నుండి చాలా మంది ప్రజలు భారత దేశం పర్యటించడానికి వస్తారు. అయితే భారత్ లో ఓ ప్రదేశాన్ని సందర్శించడానికి ఇజ్రాయెల్ వాసులు అత్యంత ఇష్టపడతారు. అది ఏ ప్రాంతం తెలుసా..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో పార్వతి నది ఒడ్డున ఉన్న ఒక మారుమూల గ్రామం కసోల్. రష్యా వారికి గోవా ఎలాగో ఇజ్రాయిల్ వారికి కసోల్ ప్రాంతం కూడా అలాగే ఓ పర్మినెంట్ టూరిస్ట్ స్పాట్ .. కసోల్ లో చక్కని వాతావరణం, అందమైన పర్వతలోయలు , పిన్ పార్వతి వ్యాలీ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామంలోని అందమైన పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ఇక ఇజ్రాయిల్ లోని ప్రజలందరూ ఖచ్చితంగా తమ దేశ ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని రోజులు పనిచేశాక వారు ఆ డ్యూటీ నుండి రిలీవ్ చేయబడతారు. అన్ని రోజులు సైనికులుగా పనిచేశాక కాసింత రిలాక్స్ కోసం వారు కసోల్ కు రావడం ప్రారంభించారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అరమీలోని తమ సేవలను ముగించుకుని వచ్చిన ఇజ్రాయిల్ సైనికులు కసోల్ కు వచ్చి ఇక్కడ పార్వతీ లోయ లోని ట్రెక్కింగ్ ఆస్పాదిస్తారు. కొన్ని రోజులు ఇక్కడ సంతోషంగా గడిపి తమ దేశానికి ప్రయాణమవుతారు.