Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirgundi Benefits: చవితి పూజలోనే కాదు.. ఎటువంటి కీళ్లనొప్పులు, వాపులనైనా ఇట్టే మాయం చేసే వావిలి.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకం

Medicinal Herb-Nirgundi Benefits: వినాయక చవితి పూజకు ఉపయోగించే పత్రిలో పద్నాల్గవ ఆకు వావిలి(సింధురవార పత్రి). ఈ వావిలి మొక్కలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి...

Nirgundi Benefits: చవితి పూజలోనే కాదు.. ఎటువంటి కీళ్లనొప్పులు, వాపులనైనా ఇట్టే మాయం చేసే వావిలి.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకం
Nirgundi
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2021 | 8:21 AM

Medicinal Herb-Nirgundi Benefits: వినాయక చవితి పూజకు ఉపయోగించే పత్రిలో పద్నాల్గవ ఆకు వావిలి(సింధురవార పత్రి). ఈ వావిలి మొక్కలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి. ఈ ఆకు గురించి ఆయుర్వేదం మందుల్లోనే కాదు ఆధునిక వైద్యంలో కూడా నొప్పులకు తయారు చేసే మెడిసిన్స్ లో ఉపయోగిస్తారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో ఉంటుంది. ఇప్పుడంటే ఏ చిన్న నిప్పులు వచ్చినా యాంటియాటిక్స్ అంటూ మెడిసిన్స్ వాడుతున్నాం కానీ కొన్ని ముందు తరాల వరకూ ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఈ వావిలి ఆకుని ఉపయోగించేవారు. ఈ ఆకులను నీటిలో వేసి ఆ నీటితో  స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయని పెద్దల నమ్మకం. అంతేకాదు ఇంట్లో డెలివరీ అయిన తర్వాత స్త్రీలు స్నానం చేసే సమయంలో వేడి నీటిలో ఈ ఆకులను వేసి స్నానం చేసేవారు. ఈరోజు వావిలి ఆకూ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు మంచి మెడిసిన్. అంతేకాదు.. కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు తగ్గటానికి ఈ వావిలి ఆకులు సహాయపడుతాయి. ముందుగా ఆకులను తీసుకుని మెత్తని పేస్టులా చేయాలి. ఈ  పేస్ట్ ని కొంచెం వేడి చేసి.. నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే.. వాపులు, నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

*వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి. అందుకు నువ్వుల నూనె వావిలాకు రసం కలిపి పొయ్యి మీద పెట్టి .. నీరు అంతా ఇగిరిపోయేదాకా మరిగించాలి.. అప్పుడు నూనె వస్తుంది. దీనిని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పులు, అన్నీ రకాల నొప్పులు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

*వావిలి ఆకుల కషాయంలో, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది.

*వావిలి పువ్వులను కలరావ్యాధిని, జ్వరం, కాలేయం, గుండెజబ్బులు నివారించడానికి ఓషధులగా వాడతారు.

*ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు వావిలి పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది.

*ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో వావిలి మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్ల సహా అన్ని భాగాలు  ఔషధాలుగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి వావిలిని ఉపయోగిస్తారు.

*వావిలి ఆకుల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది.

వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు.

*ఇప్పుడు వావిలాకు పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది ఆయుర్వేద షాపుల్లో అలాగే ఆన్లైన్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. అర స్పూన్ పొడిని 2 కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించి వడగట్టి తాగితే దగ్గు, గొంతు చికాకు, జ్వరం వంటివి తగ్గిపోతాయి.

Also Read: Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల ‘ఉప్పలపాటి’వారి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..