AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల ‘ఉప్పలపాటి’వారి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Bahubali Prabhas Photo Viral : రెబల్ సార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు ప్రభాస్. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాలతో డార్లింగ్ ప్రభాస్..

Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల  'ఉప్పలపాటి'వారి ఫ్యామిలీ..  సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Prabhas Family
Surya Kala
|

Updated on: Sep 28, 2021 | 7:44 AM

Share

Bahubali Prabhas Photo Viral : రెబల్ సార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు ప్రభాస్. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాలతో డార్లింగ్ ప్రభాస్ గా అమ్మాయిల కలలు హీరోగా మారాడు. ఇక బాహుబలి సినిమాతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. ఇక తనకు నచ్చినవారిని అసలు వదిలిపెట్టడని వారి కోసం ఏమైనా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్.. అదే సమయంలో సినిమా షూటింగ్ లో ఏ మాత్రం ఖాళీ దొరికినా ప్రభాస్ తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతారు.

సినీ నటీనటుల ఫ్యామిలీకి సంబంధించిన విషయాలంటే ఎవరికైనా ఆసక్తిని.. అదే తమ అభిమాన హీరో ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవడం మరింత ఇష్టం. సోషల్ మీడియా , స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ హీరోలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుస్తున్నాయి. తమ ఫ్యామిలీకి సంబందించిన ఏదైనా అకేషన్ జరిగినా చిన్నప్పటి ఫోటోలు అంటూ.. ఇదొక సందర్భాన్ని పురష్కరించుకుని కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ప్యాన్ ఇండియా హీరో ఉప్పలపాటి ప్రభాస్ ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల డాటర్స్ డే ని పురష్కరించుకుని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

అందులో ఒక ఫోటోలో సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు తన కుమార్తెలు, కుమారుడి ప్రభాస్, మనవరాళ్లు, మనవాళ్లతో  మొత్తానికి ఉప్పలపాటి కుంటుంబానికి చెందిన పలువురు దర్శనం ఇచ్చారు.  కుటుంబ సభ్యుల మధ్య కృష్టంరాజు నవ్వుతు కూర్చున్న ఈ  ఫ్యామిలీ కలర్ ఫుల్ గా దర్శనం ఇచ్చింది.  రెబల్ స్టార్ కృష్ణం రాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. మొత్తానికి ఆ ఫోటోని చూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు ఒకటే కామెంట్స్ చేస్తున్నారు..అదే చక్రం సినిమాలోని “జగమంతకుటుంబం” అంటూ.. ఎవరికైనా కుటుంబ సభ్యులతో గడపడం ఇష్టమేకదా.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఆదిపురుష్, సలార్ వరస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు.

Also Read: Horoscope Today: ఏ రాశివారు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..