Horoscope Today: ఏ రాశివారు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (September 28th 2021): చాలామంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. ఎవరు ఏ పని చేయాలన్నా ఏ పనిని మొదలు పెట్టాలన్నా..

Horoscope Today: ఏ రాశివారు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2021 | 7:05 AM

Horoscope Today (September 28th 2021): చాలామంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. ఎవరు ఏ పని చేయాలన్నా ఏ పనిని మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు.  అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు  (సెప్టెంబర్ 28వ తేదీ )మంగళవారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి  కొత్తపనులను చేపట్టే అవకాశం ఉంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి గౌరవమర్యాదలు దక్కుతాయి. శుభవార్త వింటారు. ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది.

వృషభ రాశి:ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడంమంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు. అనారోగ్యబారిన పడే అవకాశం ఉంది.  ఓర్పుకి కలిగి ఉండాలి.

మిధున రాశి:ఈరాశివారికి ఈరోజు పరిస్థితులను మీ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న తగువులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో అప్రమత్తత అవసరం. ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పు చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  బంధుమిత్రులను కలుస్తారు.  రాజకీయ రంగాల్లోని వారికీ అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. చేపట్టిన పనులు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని పనులను రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది. స్త్రీల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు ఉంటాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మొత్తానికి ఈరోజు సంతోషంగా గడుపుతారు.

తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు మానసిక ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సమయంలో మెలకువ అవసరం. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు నూతన వస్తు , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. శుభవార్త వింటారు.

ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తిరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  వృధా ప్రయాణాలు చేస్తారు. దీంతో శారీరకంగా అలసటకు గురవుతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరితో స్నేహంగా మెలగడం మంచిది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి స్త్రీ వలన లాభం పొందుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.  కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.మీ మంచిపనులు ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. స్థిరాస్థులకు సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటారు.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి ఋణప్రయత్నాలు ఫలిస్తాయి.  బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.

Also Read:   మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన ముఖ్యమంత్రి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!