Bigg Boss 5 Telugu: పశ్చాత్తాపంతో కుమిలిపోయిన రవి.. తలెత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉందంటూ ఎమోషనల్..
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బయట పెద్దగా పాపులారిటీ
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బయట పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు హౌస్‌లోకి వెళ్లక తమ ఆట తీరుతో జనాలకు దగ్గరైనవారున్నారు. అలాగే చిన్న చిన్న పొరపాట్లతో అడ్డంగా బుక్కయ్యి… ఇమేజ్ పొగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. ఇప్పుడు రవి పరిస్థితి కూడా అలాగే మారింది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ.. చిన్న చిన్న షోలు చేస్తూ.. సెలబ్రెటీగా మారిపోయాడు. బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అయితే… శనివారం నాటి ఎపిసోడ్లో రవి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. లహరి గురించి ప్రియ దగ్గర మాట్లాడిన మాటలు.. అనంతరం నేను అసలు అనలేదని.. ప్రియ తనను తప్పుగా చూపిస్తుందని…చివరకు అమ్మ మీద కూడా ఒట్టేసాడు. కానీ బిగ్‌బాస్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత నాగార్జున వచ్చి.. రవి నిజస్వరూపాన్ని బయటపెట్టడంతో.. ట్రాన్స్‌లో ఉన్నానంటూ కవరింగ్ చేస్తూ.. మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక శనివారం ఎపిసోడ్ నుంచి రవి.. లహరి, ప్రియ విషయంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపానికి గురవుతున్నట్లుగా కనిపిస్తోంది.
తను చేసిన తప్పును ఒప్పుకుంటూ.. ఇంట్లో సభ్యుల ముందు నిల్చోని.. తల పైకెత్తాలంటే సిగ్గుగా ఉందంటూ చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్పాడు.. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో రవి.. తన తప్పులను ఒప్పుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈరోజు మీ అందరి ఎదురుగా తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రెండు రోజులుగా చాలా బాధను అనుభవిస్తున్నాను. గత శనివారం నా జీవితంలోనే వరస్ట్ డే. ఈ విషయంలో నేను ముగ్గురికి క్షమాపణ చెప్పాలి. అది ఎవరికంటే.. ప్రియ అక్కకు.. సెకండ్ లహరికి.. థర్ట్ మా అమ్మకు. నేను ఎంత దారుణంగా ప్రవర్తించానంటే.. నేను ప్రియగారితో చెప్పిన మాటలను ఆవిడతో చెప్పలేదని చెప్పి మా అమ్మపై ఒట్టు వేసాను. అంతకంటే దారుణం మరోకటి ఉండదు. ఇలా ఒక వక్తి మాట్లాడకూడదు. నేను మాట్లాడాను. అందుకే సిన్సియర్ గా క్షమాపణ చెప్తున్నా.. ఈరోజు ఇక్కడ లహరి లేదు.. తను ఇక్కడ ఉండి ఉంటే మాట్లాడేవాడిని.. అమ్మ మీద ఒట్టేసి అంత పెద్ద మాట అన్నాను. సారీ అమ్మ.. సారీ అక్కా.. అంటూ ఎమోషనల్ అయ్యాడు రవి. ఇక ఆతర్వాత తనను కొట్టిందని కాజల్‌ను… తననే గుంటనక్క అన్నారంటూ నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేశాడు.