Bigg Boss 5 Telugu: నాలుగోవారంలో నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఒక్కొక్కరి నటన మాములుగా లేదుగా..
బిగ్‌బాస్ సీజన్ 5 నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. మిగతా వారం రోజులు ఎలా ఉన్నా.
బిగ్‌బాస్ సీజన్ 5 నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. మిగతా వారం రోజులు ఎలా ఉన్నా.. నామినేషన్స్ రోజున ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ రెచ్చిపోతుంటారు. ఏడుపులు, అరుచుకోవడం చేస్తూ.. సైకోల్లా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటివరకు మూడు వారాలు గడిచి.. నాలుగో వారానికి చేరుకుంది. ఇక మొదటి వారంలో సరయు ఇంటిని విడగా… రెండో వారంలో ఉమాదేవి.. మూడో వారంలో లహరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో మరింత హీట్ పెంచింది. నిన్న (సెప్టెంబర్ 27న) ఏం జరిగిందో తెలుసుకుందామా.
సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారింది. ఇంట్లో ఒక్కో సభ్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నామినేట్ చేస్తూనే శ్రుతి మించి మరీ రెచ్చిపోయారు. ఇక లోబో, ప్రియ.. నటరాజ్ మాస్టర్, విశ్వల మధ్య జరిగిన మాటల యుద్ధం… తీవ్రంగా మారింది. ప్రతి వారం లాగే.. ఒక్కో సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో.. వారి ఫోటోలోని ఒక భాగాన్ని తీసి స్వీమ్మింగ్ ఫూల్ లో వేయాలని చెప్పారు బిగ్ బాస్. ఇక ఈ ప్రక్రియను ప్రియతో మొదలుపెట్టామని ఆదేశించాడు బిగ్ బాస్.. మొదటగా వచ్చిన ప్రియ.. లోబో, సన్నీ తనతో సరిగ్గా ఉండడం లేదని నామినేట్ చేసింది. ఆ తర్వాత విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత లోబో.. ప్రియ, సిరిలను నామినేట్ చేస్తూ.. విశ్వరూపం ప్రదర్శించాడు. ఇక శ్రీరామ్.. శ్వేత, యానీ మాస్టర్.. నటరాజ్ మాస్టర్, ఆర్జే కాజల్ సన్నీ.. సిరి, యానీ మాస్టర్, లోబో.. మానస్, లోబో, నటరాజ్ మాస్టర్.. శ్వేత, లోబో, యాంకర్ రవి.. హమీదా, నటరాజ్ మాస్టర్, లోబో.. నటరాజ్ మాస్టర్, విశ్వ, యాంకర్ రవి.. ప్రియాంక, లోబో, కాజల్.. యాంకర్ రవి, కాజల్ నటరాజ్ మాస్టర్.. యానీ మాస్టర్ సిరి, శ్రీరామ్.. సన్నీ, ప్రియ, కాజల్.. జెస్సీ, ప్రియాంక, యాంకర్ రవిలను నామినేట్ చేయగా.. షణ్ముఖ్, యాంకర్ రవి, లోబోలను నామినేట్ చేసాడు.
మొత్తంగా ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు.
Also Read: Sai Pallavi: మహేష్ బాబు ప్రశంసలపై స్పందించిన సాయి పల్లవి.. నాలో ఉన్న మీ అభిమాని అంటూ..
”అలా చేస్తే పవన్‌కు గుడి కట్టి.. పూజలు చేస్తా”.. పవన్ కళ్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు..