Sai Pallavi: మహేష్ బాబు ప్రశంసలపై స్పందించిన సాయి పల్లవి.. నాలో ఉన్న మీ అభిమాని అంటూ..
Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'లవ్ స్టోరీ'. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే...
Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల తన మార్కుకు విభిన్నంగా తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. సమాజంలో పాతుకు పోయిన అంశానికి అందమైన ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి, నాగచైతన్య నటనపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు కూడా చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
సాయిపల్లవి అద్భుత నటనను కనబరిచిందని ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి మహేష్ చేసిన ట్వీట్ స్పందించింది. మహేష్ చేసిన ట్వీట్‌కు కామెంట్ చేస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ లక్షలసార్లు చదివించింది సార్’ అంటూ రాసుకొచ్చింది సాయి పల్లవి.
Woah? It’s going to take me a while to come back to my senses!!! I’m humbled by your generous words ☺️ Thank you so much Sir ? P.S. The fan girl in me has already read your tweet a million times ?
— Sai Pallavi (@Sai_Pallavi92) September 26, 2021
ఇదిలా ఉంటే విడుదలకు ముందే మంచి బజ్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా మంచి టాక్‌తో నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా, నికర వసూళ్లు 22 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Liger Movie: లైగర్ క్లైమాక్స్‌లో మైక్ టైసన్.. ఇక పంచ్‌లు మామూలుగా ఉండవుగా..!
”అలా చేస్తే పవన్‌కు గుడి కట్టి.. పూజలు చేస్తా”.. పవన్ కళ్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు..