Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

”అలా చేస్తే పవన్‌కు గుడి కట్టి.. పూజలు చేస్తా”.. పవన్ కళ్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు..

Posani Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ ఏంటో ప్రపంచానికి తెలుసని, అందుకే ప్రజలు ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చారని పోసాని కృష్ణమురళీ అన్నాడు. 'జగన్‌తో పోల్చుకునే..

''అలా చేస్తే పవన్‌కు గుడి కట్టి.. పూజలు చేస్తా''.. పవన్ కళ్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2021 | 8:45 PM

వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పోసాని కృష్ణమురళీ తప్పుబట్టారు. ‘తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఉంది’. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంలో తప్పులేదు. ఆధారాలు చూపించాలి. ఆడియో ఫంక్షన్‌లో మంత్రులను, సీఎంను పవన్ తిట్టడం సరికాదు. పవన్ కళ్యాణ్ వాడిన భాష అభ్యంతరకరమని పోసాని కృష్ణమురళీ అన్నారు.

జగన్‌కు కులపిచ్చి ఉందని పవన్ నిరూపిస్తారా.? చిరంజీవి నోటి నుంచి ఎప్పుడైనా అమర్యాదకర పదాలు వచ్చాయా.? అని పోసాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు ప్రశ్నించాలో.? ఎక్కడ ప్రశ్నించాలో తెలియదని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏంటో ప్రపంచానికి తెలుసని.. అందుకే ప్రజలు ఆయనకు రెండు చోట్లా గుణపాఠం నేర్పించారని పోసాని కృష్ణమురళీ అన్నారు.

‘జగన్‌తో పోల్చుకునే వ్యక్తిత్వం పవన్‌కు ఉందా.? జగన్ పనితీరును దేశమంతా గుర్తించిందని పోసాని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలను జగన్ పూర్తిగా మార్చేశారని పోసాని కృష్ణమురళీ కొనియాడారు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చిన ఓ పంజాబీ అమ్మాయిని అవకాశాల పేరుతో ఓ ప్రముఖుడు మోసగించాడు. విషయం బయటపెడితే చంపేస్తానని అతడు బెదిరించాడు. ఆ బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కు గుడి కట్టి పూజలు చేస్తా.. ఆ యువతికి న్యాయం చేయలేకపోతే.. మంత్రులను ప్రశ్నించే హక్కు పవన్‌కు ఉండదని పోసాని కృష్ణమురళి అన్నారు.

చంద్రబాబు హయాంలో రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఆ విషయాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు.? అని పోసాని అన్నారు. పవన్ కళ్యాణ్ తానే ప్రశ్నలు వేసుకుంటారని.. తానే జవాబు చెప్పుకుంటారని పోసాని అన్నారు. పవన్ ఇంకా చాలా నేర్చుకోవాలని.. జగన్‌తో పోల్చుకోవద్దు అని పోసాని కృష్ణమురళీ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషీ కాదు.. పరిశ్రమ మనిషీ కాదని.. ఆయన మాటలకు.. చేతలకు పొంతన లేదని చెప్పుకొచ్చారు.

మరోవైపు పవన్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించిన పోసాని కృష్ణమురళి.. ఒక్కో సినిమాకి పవన్ రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ పవన్ రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోకపోతే నిరూపించాలని.. నిజమైతే నన్ను చెంపదెబ్బ కొట్టొచ్చునని పోసాని చెప్పారు. ఇండస్ట్రీ తనని బ్యాన్ చేసినా ఫర్వాలేదని పోసాని కృష్ణమురళీ స్పష్టం చేశారు.

Also Read:

పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?

కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!