Viral Video: కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!
King Cobra Viral Video: అడవిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జంతువుల మధ్య భీకర పోరాటాలు ఎలప్పుడూ జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనల్ని..
అడవిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జంతువుల మధ్య భీకర పోరాటాలు ఎలప్పుడూ జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరిచేలా బలశాలి అయిన జంతువుల మధ్య ఫైట్స్ జరుగుతాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి..
కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనా, ప్రమాదకరమైన సరీసృపం. దీనితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఏ జంతువుకైనా ఇది సమవుజ్జీనే. ఇక కింగ్ కోబ్రా దూరం నుంచి కనిపిస్తే చాలు.. మనిషికి అయితే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా కింగ్ కోబ్రా ఓ రాకాసి బల్లితో యుద్దానికి దిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. కేరళలోని మలయట్టూర్ అనే అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రహదారిపై కింగ్ కోబ్రా, రాకాసి మధ్య భీకర పోరాటం జరిగింది. వీరిద్దరి మధ్య యుద్ధంలో కింగ్ కోబ్రా చాలా సార్లు బల్లిని కాటు వేసేందుకు ప్రయత్నించగా.. దాని నుంచి తప్పించుకుంటూ రాకాసి బల్లి ఎదురుదాడికి దిగింది.
సుమారు 10 నిమిషాల పాటు వీరి మధ్య పోరాటం జరగగా.. చివరికి ఎవరూ ఓడిపోలేదు. పాము పొదల వైపుకు వెళ్లిపోగా.. రాకాసి బల్లి దానికి వ్యతిరేక దశలో పరుగులు పెట్టింది. ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలను ‘Bobins Abraham Vayalil’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై కామెంట్స్, లైకులు వెల్లువెత్తుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.!
Also Read:
పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?
ఈ కొండల మధ్య చిరుత సేద తీరుతోంది.. కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.!
భారీ అనకొండల మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి.. వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.!
వీడియో క్రింద ట్వీట్‌లో చూడండి..
This is crazy! A king cobra and a monitor lizard fighting it out in the wild. This was shot by Forest officials from Malayattoor in Kerala. Apparently they fought for nearly 10 minutes before the two got seperated and went different ways. pic.twitter.com/QU68HJjSyu
— Bobins Abraham Vayalil (@BobinsAbraham) September 20, 2021