Pakistan Currency: పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?
Pakistan Currency: పాకిస్తాన్.. పేరుకు ఆ దేశం మన శత్రు దేశమే అయినా.. అక్కడుందే వాటి గురించి పెద్దగా మనకు తెలియదు. ఉగ్రవాదానికి మారుపేరుగా..
పాకిస్తాన్.. పేరుకు ఆ దేశం మన శత్రు దేశమే అయినా.. అక్కడుందే వాటి గురించి పెద్దగా మనకు తెలియదు. ఉగ్రవాదానికి మారుపేరుగా నిలిచే పాకిస్తాన్‌లో ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుంది.? పాకిస్తాన్ కరెన్సీ పరంగా మన రూపాయి విలువ ఎంత ఉంటుంది.? లాంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత కరెన్సీకి, పాకిస్తాన్ కరెన్సీకి చాలా వ్యత్సాసం ఉంది. భారతదేశంలో రూ .1, రూ .2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ .50, రూ .100, రూ .200, రూ .500, రూ .2000 నోట్లు ఉంటే.. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్‌లో కరెన్సీ వ్యవస్థ ఉంది. కొన్ని సంవత్సరాల క్రిందట ఇండియాలో రూ. 1000 నోటును బ్యాన్ చేశారు. దాని స్థానంలోనే రూ. 2000 నోట్‌ను అమలులోకి తీసుకొచ్చారు. కానీ పాకిస్తాన్‌లో ఇలా కాదు. అక్కడ హయ్యెస్ట్ కరెన్సీ రూ. 5 వేల నోట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. ఆ దేశంలో రూ .5, రూ .10, రూ .20, రూ .50, రూ .100, రూ .500, రూ .1000, రూ .5000 నోట్లు చలామణీలో ఉన్నాయి.
పాకిస్తాన్‌లో మన కరెన్సీ విలువ డబుల్. ఒక రూపాయి – 2.29 పాకిస్తానీ రూపాయలతో సమానం. అయితే ఇండియాలో పాకిస్తానీ కరెన్సీ మన రూపాయిలో సగం. ఒక పాకిస్తానీ రూపాయి – 0.44 ఇండియన్ రూపాయికి సమానం. ఇక యూఎస్ డాలర్‌తో పోలిస్తే.. పాకిస్తానీ రూపాయి – 0.0059 యూఎస్ డాలర్‌తో సమానం. అలాగే ఒక యూఎస్ డాలర్.. మన కరెన్సీలో రూ .74.05తో సమానం. ఇక పాకిస్తాన్‌లో మన రూ. 2 వేలు విలువ.. రూ. 4567.40తో సమానం.
ఇదిలా ఉంటే మన ఇండియన్ కరెన్సీపై మహాత్మా గాంధీ చిత్రం ఉన్నట్లుగానే.. పాకిస్తాన్ కరెన్సీపై మహ్మద్ అలీ జిన్నా ఫోటో ఉంటుంది. నోట్ ముందు వైపు జిన్నా ఫోటో.. భారత కరెన్సీ మాదిరిగానే పాకిస్తాన్ నోట్లపై కూడా స్టేట్ బ్యాంక్ మొదలగునవి రాసి ఉంటాయి. మన కరెన్సీ నోట్లపై కీలక సమాచారం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉంటే.. పాకిస్తాన్ నోట్లపై ఉర్దూలో ఉంటుంది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్’ అని నోట్ పైభాగంలో, క్రింద భాగంలో పలు వాగ్దాన, హామీ వ్యాక్యాలు.. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ అని లిఖించబడి ఉంటుంది.
వాటర్‌మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్ లాంటి భద్రతాపరమైన ఫీచర్లు పాకిస్తాన్ నోట్లపై ఉన్నాయి. అలాగే వివిధ చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు సైతం ఉంటాయి. 10 రూపాయల నోటుపై పెషావర్‌లోని ఖైబర్ పాస్, 20 రూపాయల నోటుపై మొహంజోదారో, 50 రూపాయల నోటుపై కారకోరం శిఖరం ఫోటోలు ఉంటాయి.
Also Read:
- ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్లో సహాజ నటి.!
- బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?
- గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
- ఈ కొండల మధ్య చిరుత సేద తీరుతోంది.. కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.!
- భారీ అనకొండల మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి.. వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.!