Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?

1983వ సంవత్సరంలో తొలిసారిగా భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారిగా ప్రపంచకప్..

బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?
Mohindar
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 25, 2021 | 9:21 AM

1983వ సంవత్సరంలో తొలిసారిగా భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లు వరల్డ్‌కప్ విన్నర్ అయిన వెస్టిండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇక అప్పటి టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఎందరో హీరోలున్నారు. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓ ఆటగాడు.. ఇప్పటికీ లైమ్-లైట్‌లోకి రాలేకపోయారు. ఆయనెవరో కాదు మొహిందర్ అమర్‌నాథ్. 1970-80 మధ్య భారత క్రికెట్‌లో అద్భుత బ్యాట్స్‌మెన్లలో ఈయనొకరు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇవాళ అమర్‌నాధ్ కెరీర్‌లోని పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1950వ సంవత్సరంలో పంజాబ్‌లోని పాటియాలాలో జన్మించిన మొహిందర్ అమర్‌నాధ్.. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించాడు. ఆ తర్వాత 19 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో మొహిందర్ 16 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా మొహిందర్ జట్టులో చోటును కోల్పోయాడు. దీనితో అతడు మళ్లీ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు 6 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 1976వ సంవత్సరంలో తిరిగి జట్టుకు వచ్చాడు. అనంతరం 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో, మొహిందర్ మొదటి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి, ఆపై రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి తన అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. మొహిందర్‌కు అదే తొలి టెస్టు సెంచరీ.

మొహిందర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉండేది. ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ అతడి శరీరాన్ని టార్గెట్ చేసేవారు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ హాడ్లీ విసిరినా ఓ బౌన్సర్‌కు మొహిందర్ తల విరగగా.. విండీస్ పేసర్ మాల్కం మార్షల్ వేసిన బంతికి అతడి పళ్లు విరిగాయి. అలాగే ఆస్ట్రేలియా బౌలర్ జెఫ్ థామ్సన్ విసిరిన బంతికి మొహిందర్ దవడ ఎముకలు విరిగాయి. ఇలా ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లను మొహిందర్ సమర్ధవంతంగా ఎదుర్కుని నిలబడ్డాడు.

కాంట్రావర్సీ కెరీర్..

మొహిందర్ కెరీర్ మొత్తం కాంట్రావర్సీలు ఉంటాయి. ఎప్పుడూ ఏదొక గొడవలో ఇరుక్కునేవాడు. తరచూ సెలెక్టర్లు, బోర్డుతో గొడవపడేవాడు. ఇక తన తండ్రి లాలా అమర్‌నాథ్ లాగానే, మొహిందర్ కూడా తన తన అభిప్రాయాలను బహిర్గతంగా వెల్లడించేవాడు. ఒకానొక సందర్భంలో బీసీసీఐ సెలెక్టర్లను ‘గ్రూప్‌ ఆఫ్ బఫూన్‌లు’ అని సంబోధించాడు.

ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర..

1983లో, భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇందులో మొహిందర్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో, మొహిందర్ 12 ఓవర్లలో 46 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే ఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌పై 26 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 7 ఓవర్లకు కేవలం 12 పరుగులు సమర్పించి 3 వికెట్లు తీసుకున్నాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

కాగా, మొహిందర్ 69 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 42.5 సగటుతో 4378 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 32 వికెట్లు తీశాడు. అదే సమయంలో 85 వన్డేలలో, మొహిందర్ 30.53 సగటుతో 1924 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీనితో పాటు. 46 వికెట్లు అతడి ఖాతాలో వేసుకున్నాడు.

Also Read:

కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!

25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న భవనం తలుపులు.. ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్.!

సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. చుక్కలు చూపిందిగా.. అద్భుతమైన వీడియో మీకోసమే.!