- Telugu News Photo Gallery Cricket photos IPL 2021: Kyle Jamieson ‘flirts’ with RCB massage therapist, all you need to about that mystery girl who is Navnita Gautam
కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!
RCB Mystery Girl: ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ డగౌట్‌లో ఉన్న ఓ అమ్మాయి మాత్రం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి.!
Updated on: Sep 24, 2021 | 1:48 PM

ఐపీఎల్ సెకండాఫ్‌లో విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ డగౌట్‌లో ఉన్న ఓ అమ్మాయి మాత్రం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి.!

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్కోర్ 53/4 ఉన్నప్పుడు కెమెరామెన్ తన స్కిల్స్ చూపించాడు. బెంగళూరు డగౌట్ వైపు కెమెరాను తిప్పగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు కైల్ జామీసన్ ప్యాడ్స్‌తో సిద్దంగా ఉన్నాడు. ఇక అతడు తన పక్కనే ఉన్న ఓ అమ్మాయికి లైన్ వేస్తూ చిరునవ్వులు చిందిస్తాడు. ఆ క్లిక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఆ అమ్మాయి ఎవరో కాదు ఆర్సీబీ జట్టు మసాజ్ థెరపిస్ట్ నవనీత గౌతమ్. ఆమె 1992 ఏప్రిల్ 11న కెనడాలోని వాంకోవర్‌లో జన్మించింది. 2019లో ఆర్సీబీ జట్టులో మసాజ్ థెరపిస్ట్‌గా చేరారు. మొత్తం ఎనిమిది ఐపీఎల్ జట్లలోనూ ఏకైక మహిళా సిబ్బంది ఈమే.

RCB జట్టులో చేరక ముందు.. గ్లోబల్ T20 కెనడాలో టొరంటో నేషనల్స్ టీమ్‌తో పని చేశారు. అలాగే, ఆసియా కప్‌కు భారత మహిళా బాస్కెట్‌బాల్ జట్టులో సహాయక సిబ్బందిగా నవనీత గౌతమ్ పనిచేశారు.

2019లో ఓ జర్నలిస్ట్.. ఐపీఎల్‌లో సహాయక సిబ్బందిలో మీరు ఒక్కరే ఏకైక మహిళ కావడం మీకు ఎలా అనిపిస్తోందని అడగగా.. నవనీత గౌతమ్ నవ్వుతూ.. ''తన వెంట ఎప్పుడూ 20 మంది బ్రదర్స్ ఉంటారంటూ'' సమాధానం ఇచ్చింది.





























