Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS IPL 2021 Match Prediction: ప్రతీకారంతో పంజాబ్.. పరువు కోసం హైదరాబాద్.. షార్జా పోరులో నిలిచేదెవరో?

Today Match Prediction of Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్ 2021లో భాగంగా 37 వ మ్యాచులో భాగంగా నేడు పీబీకేఎస్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది.

SRH vs PBKS IPL 2021 Match Prediction: ప్రతీకారంతో పంజాబ్.. పరువు కోసం హైదరాబాద్.. షార్జా పోరులో నిలిచేదెవరో?
Ipl 2021 Srh Vs Pbks
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 8:22 AM

IPL 2021, SRH vs PBKS: ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 37వ మ్యాచులో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌ (PBKS)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) తలపడనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాలను ఆక్రమించిన రెండు జట్లు ఒకదానితో ఒకటి పోరాడతాయి. అయితే ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఎప్పుడు: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్‌, సెప్టెంబర్ 25, 2021, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా

లైవ్ ఎక్కడ, ఎలా చూడాలి: ఐపీఎల్ మ్యాచులన్నీ డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

SRH vs PBKS హెడ్-టు-హెడ్ ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 17 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ కేవలం 5 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ ఏడాది ప్రారంభంలో చెపాక్‌లో హైదరాబాద్ జట్టు రాహుల్ నేతృత్వంలోని జట్టును కేవలం 120 పరుగులకే పరిమితం చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఇప్పటివరకు టోర్నమెంట్‌లో తన సత్తాను చూపించలేదు. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ టీం కేవలం ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది. 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే యాదృచ్ఛికంగా ఈ టోర్నమెంట్‌లో వారి ఏకైక విజయం ఐపీఎల్ మొదటి దశలో పంజాబ్ కింగ్స్‌పై వచ్చింది. అప్పుడు కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌ టీంను 9 వికెట్ల తేడాతో ఓడించారు. కానీ, అది ఒక సుదూర జ్ఞాపకంలా మిగిలిపోయింది. ఆ విజయం తరువాత హైదరాబాద్ టీం వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇప్పటి నుంచి వరుసగా అన్ని మ్యాచులు గెలిచినా ప్లే ఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖష్టమే.

ఎస్‌ఆర్‌హెచ్ సీజన్ మధ్యలో వారి కెప్టెన్‌ని మార్చింది. ఐపీఎల్ ద్వితీయార్ధంలో వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌కు తిరిగి వచ్చాడు. అయితే అతను వరుసగా మూడు డకౌట్‌లు కావడం గమనార్హం. ఇప్పటికే పలు ఇబ్బందులతో టీం సతమతమువుతుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ టీం ఎడమ చేతి సీమర్ టి నటరాజన్ కోవిడ్ -19 బారిన పడ్డాడు. ఆయన స్థానంలో జమ్ము కాశ్మీర్ బౌలర్‌ ఉమ్రాన్‌ను తాత్కాలికంగా జట్టులోకి తీసుకున్నారు. అలాగే ఐపీఎల్ ఫేజ్ 2 ప్రారంభ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

మరోవైపు, పంజాబ్ కింగ్స్ (PBKS) టీం పరిస్థితి కూడా అలానే తయారైంది. పంజాబ్ జట్టుకు తమ చివరి మ్యాచును కోల్పోయిన విధానం చూస్తే అంతా నోరెళ్లబెడతారు. చేతిలో 8 వికెట్లు ఉండగా రాజస్థాన్‌పై చివరి ఓవర్‌లో 4 పరుగులు అవసరం అయ్యాయి. కానీ, పంజాబ్ జట్టు ఆ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. వారి ఓపెనర్లు, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరూ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పినా.. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్ దానిని కాపాడడంలో మాత్రం విఫలమవుతున్నారు. రాహుల్ ఈ సీజన్‌లో 63.33 సగటుతో 8 ఇన్నింగ్స్‌లలో 380 పరుగులు చేయగా, అగర్వాల్ 46.71 సగటుతో 327 పరుగులు చేశాడు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహ్మద్ షమీ నాయకత్వంలోని పేస్ దళం ఆకట్టుకుంటుంది. అనుభవజ్ఞుడైన కుడిచేతి పేసర్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 11 వికెట్లు పడగొట్టాడు. 17.82 అద్భుతమైన స్ట్రైక్ రేట్ వద్ద వికెట్లను సాధించాడు. పంజాబ్ కింగ్స్ మునుపటి మ్యాచులో అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు సాధించిన నేపథ్యంలో యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగనున్నాడు.

పిచ్: షార్జా క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకు వస్తుంది. మైదానం చాలా చిన్నది కావడంతో బౌండరీల వర్షం కురవనుంది. బౌలర్లకు మాత్రం షార్జా మైదానం చాలా కష్టమైనది. గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీంల మధ్య జరిగిన మ్యాచులోనూ అదే జరిగింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంటుంది. ఈ మైదానంలో ఛేజింగ్‌కే ఎక్కువ ఇష్టపడుతుంటారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ నిరాశపరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీం.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చేందుకు అవకాశం లేదు.

ప్లేయింగ్ ఎలెవన్ XI అంచనా: డేవిడ్ వార్నర్ , వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ టీం కూడా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మొదటి దశలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది.

ప్లేయింగ్ XI అంచనా: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, ఇషాన్ పోరెల్

మీకు తెలుసా?

– సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఓడిపోతే.. 2009 లో కేకేఆర్ టీం తరువాత ఐపీఎల్ టోర్నమెంట్‌లో మొదటి తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది కోల్పోయిన జట్టుగా మిగలనుంది.

– సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత ఐపీఎల్ 2018, 2019, 2020 లో బౌండరీల శాతం ప్రకారం ఏడవ స్థానంలో నిలిచింది. అయితే వారి బౌండరీల శాతం 2021 లో అన్ని జట్లతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 95 బౌండరీలు( ఇందులో 63 ఫోర్లు, 32 సిక్సులు) కొట్టింది. వీటిలో అత్యధికంగా 35 బౌండరీలు కొట్టిన బెయిర్ స్టో (20 ఫోర్లు, 15 సిక్సర్లు) కొట్టిన సేవలను కూడా సన్‌రైజర్స్ కోల్పోయింది.

– ఈ సీజన్‌లో బాగా నిరాశ పరుస్తున్న డేవిడ్ వార్నర్ తన 150 వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. పంజాబ్ జట్టుపై 52.39 సగటు, 140.12 స్ట్రైక్ రేట్ తో 20 ఇన్నింగ్స్‌లలో 943 పరుగులు చేశాడు.

– అర్షదీప్ సింగ్ ఐపీఎల్ 2021 లో మూడు దశల్లో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు. అర్షదీప్ సింగ్ 1-6 ఓవర్లలో ఆరు వికెట్లు, 7-15 ఓవర్లలో మూడు వికెట్లతో పాటు‎ 16-20 ఓవర్లలో ఐదు వికెట్లు తీశాడు.

టీంలు: పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: కేఎల్ రాహుల్ (కీపర్, కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరెల్, క్రిస్ గేల్, మొయిసెస్ హెన్రిక్స్, మన్ దీప్ సింగ్ , క్రిస్ జోర్డాన్, జలజ్ సక్సేనా, మురుగన్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, సౌరభ్ కుమార్, ఉత్కర్ష్ సింగ్, దర్శన్ నల్కండే, ప్రభాసిమ్రాన్ సింగ్, రవి బిష్ణోయ్, నాథన్ ఎల్లిస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, శ్రీవత్ గోస్వామి, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ నబీ, జాసన్ రాయ్, షాబాజ్ నదీమ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, బాసిల్ తంపి, జగదీశ సుచిత్, ముజీబ్ ఉర్ రహమాన్, అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, ఉమ్రాన్ మాలిక్

Also Read: DC vs RR IPL 2021 Match Prediction: ఢిల్లీ జోరు ముందు రాజస్థాన్ రాయల్స్ నిలబడేనా.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..!

Brad Hogg: టీమిండియా కెప్టెన్ కాగల సత్తా ఆ యంగ్ క్రికెటర్‌కు ఉంది.. బ్రాడ్ హాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.