Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs RR IPL 2021 Match Prediction: ఢిల్లీ జోరు ముందు రాజస్థాన్ రాయల్స్ నిలబడేనా.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..!

Today Match Prediction of Delhi Capitals vs Rajasthan Royals: ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండు, ఐదు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది.

DC vs RR IPL 2021 Match Prediction: ఢిల్లీ జోరు ముందు రాజస్థాన్ రాయల్స్ నిలబడేనా.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..!
Dc Vs Rr Ipl 2021
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 7:11 AM

IPL 2021, RR vs DC: ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండు, ఐదు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది. డీసీ టీం ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీం 8 మ్యాచులు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచంది.

ఎప్పుడు: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్, సెప్టెంబర్ 25, 2021, మధ్యాహ్నం 03:30 గంటలకు

ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

లైవ్ ఎక్కడ, ఎలా చూడాలి: ఐపీఎల్ మ్యాచులన్నీ డిస్నీ హాట్ యాప్‌లో చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

పిచ్: ట్రాక్ నెమ్మదిగా ఉంటుంది. షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం యూఏఈలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం. కాబట్టి సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే జరిగిన 24 మ్యాచులను పరిశీలిస్తే 159 తొలి ఇన్నింగ్స్‌లో యావరేజ్‌ స్కోర్‌గా నమోదైంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్‌లో అబుదాబిలో ఛేజింగ్‌కే టీంలు ఇష్టపడుతున్నాయి. టాస్ గెలిచిన జట్లు 15 సార్లు విజయం సాధించగా, ఓడిన జట్లు కేవలం 9 సార్లు మాత్రమే గెలిచాయి.

హెడ్ టూ హెడ్: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంలు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ టీం 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆధిక్యంలో నిలిచింది. ఢిల్లీ టీం 11 విజయాలను నమోదు చేసంది. ఇక యూఏఈలో తలపడిన రెండు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌నే విజయం వరించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంలో అన్రిచ్ నార్ట్జే కీలక పాత్ర పోషించాడు. నార్ట్జే, కగిసో రబాడా దుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఐదు వికెట్లు పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ టీంను ఓడించారు. యాదృచ్ఛికంగా ఐపీఎల్ 2020 లో ఢిల్లీ టీం అబుదాబిలో ఆడిన ఐదు ఆటలలో మూడింటిలో ఓడిపోయింది. అబుదాబిలో వికెట్ నెమ్మదిగా ఉంటుంది. దీంతో డీసీ ఈ మ్యాచులో వికెట్లు పడగొట్టాలంటే మాత్రం వారి పేస్ ద్వయం రబాడా, నార్ట్జే ‎వారి వేగాన్ని మరికొంచెం ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ను ఉపయోగించే చాన్స్ ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాటింగ్ యూనిట్ ఎంతో సమిష్టిగా ఆడుతున్నారు. బ్యాటింగ్‌లో డీసీ టీంకు పెద్దగా ఆందోళనలు లేవు. శిఖర్ ధావన్, పృథ్వీ షా జోడీ అత్యుత్తమంగా కలిసిపోయి తుఫాన్ ఓపెనింగ్‌లను అందిస్తున్నారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మయర్‌లతో వారి బ్యాటింగ్ లైనప్ ఎంతో పటిష్టంగా ఉంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీంలో కీలకమైన ప్లేయర్లు అందుబాటులో లేదు. దీంతో టీం అన్ని రంగాల్లో బలహీనంగా కనిపిస్తోంది. అయితే కార్తీక్ త్యాగి రూపంలో వీరికి సరికొత్త ఆశాకిరణం దొరికింది. పంజాబ్ కింగ్స్‌పై చివరి ఓవర్‌లో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్, మహిపాల్ లోమ్రర్ లాంటి కొత్త ఆటగాళ్లను ఆర్‌ఆర్‌ టీం చేర్చుకుంది. ఎవిన్ లూయిస్ మంచి భాగస్వామ్యాలను అందించడంతో జట్టులో చోటు సంపాధించాడు. అయితే క్రిస్ మోరిస్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. కానీ, ఆయనపై ఉన్న అంచనాలను మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్: గాయాలు: స్టోయినిస్ సీబీకేఎస్‌పై తన రెండో ఓవర్ వేసేటప్పుడు గాయపడ్డాడు. దీంతో నేటి మ్యాచులో ఆడతాడా లేదా అని తెలియదు.

వ్యూహాలు: ఆక్షర్ పటేల్‌పై సంజు శాంసన్ పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శాంసన్ 48 బంతుల్లో 51 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఎడమ చేతివాటం స్పిన్నర్ రెండుసార్లు శాంసన్‌ను ఔట్ చేశాడు. మరోసారి వీరిద్దరి మధ్య పోరాటాన్ని చూడొచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI అంచనా: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్ & కెప్టెన్), మార్కస్ స్టోయినిస్/స్టీవ్ స్మిత్ , షిమ్రాన్ హెట్మైర్, ఆక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్: గాయాలు: ఆర్‌ఆర్ టీం నుంచి ఇంతవరకైతే ఎలాంటి గాయాల వార్తలు వెలువడలేదు.

వ్యూహాలు: జయదేవ్ ఉనద్కత్ ఢిల్లీ కి వ్యతిరేకంగా 13.42 సగటుతో 19 వికెట్లు సాధించాడు. 2010 ప్రారంభం నుంచి ఐపీఎల్‌లో జయదేవ్ ఉనద్కత్ ఉన్నాడు. డీసీ వైపు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉనద్కత్ ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను పెవిలియన్ చేర్చాడు.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI అంచనా: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహమాన్

మీకు తెలుసా? -ఎస్‌ఆర్‌హెచ్‌కి వ్యతిరేకంగా సురేష్ రైనా (2008-14), డేవిడ్ వార్నర్ (2013-20) తర్వాత ఆరు లేదా అంతకంటే ఎక్కువ వరుస సీజన్లలో 400+ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ధావన్ నిలిచాడు.

– స్లాగ్ ఓవర్లలో ఆర్‌ఆర్‌ ఎకానమీ రేటు 9.63 గా ఉంది. ఈ సీజన్‌లో మూడవ ఉత్తమమైనదిగా నమోదైంది. 2019, 2020 సీజన్‌లో మాత్రం ఆర్ఆర్ చెత్త ఎకానమీ రేటును కలిగి ఉంది.

టీంలు: రాజస్థాన్ రాయల్స్ జట్టు: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహమాన్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ మిల్లర్ వోన్ .

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేశ్ ఖాన్, అజింక్య రహానె, అమిత్ మిశ్రా, అమేద్ అయాద్.

Also Read: Brad Hogg: టీమిండియా కెప్టెన్ కాగల సత్తా ఆ యంగ్ క్రికెటర్‌కు ఉంది.. బ్రాడ్ హాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.

IPL 2021, RCB vs CSK Match Result: ఆర్‌సీబీపై ఘన విజయం సాధించిన సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరిన ధోనిసేన