IPL 2021, RCB vs CSK Match Result: ఆర్‌సీబీపై ఘన విజయం సాధించిన సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరిన ధోనిసేన
IPL 2021, RCB vs CSK: సీఎస్‌కే టీం 6 వికెట్ల తేడాతో కోహ్లీ సేనపై విక్టరీ నమోదు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో టార్గెట్‌ను చేరుకుని విజయం సాధించింది.

IPL 2021, RCB vs CSK Match Result: ఐపీఎల్ 2021లో భాగంగా 35 వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో రాయల్స్ ఛాలెంజ్ బెంగళూరు టీం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో సీఎస్‌కే టీం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 6 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోని సేన.. 18.1 ఓవర్లలో టార్గెట్‌ను చేరుకుని విజయం సాధించింది. దీంతో సీఎస్‌కే టీం పాయింట్ల పట్టికలో 7 విజయాలతో 14 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. కోహ్లీ సేన మాత్రం మూడో స్థానంలోనే నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్(38 పరుగులు, 26 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), డుప్లిసిస్ (31 పరుగులు, 26 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం 8.2 ఓవర్లో చాహల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి రుతురాజ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం 9.1 ఓవర్లో మాక్స్‌వెల్ బౌలింగ్‌లో సైనీకి క్యాచ్ ఇచ్చి డుప్తిసిస్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మొయిన్ అలీ (23 పరగులు, 18 బంతులు, 2 సిక్సులు)లతో కొద్దిసేపు దడదడలాడించినా.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 118 పరుగుల వద్ద మూడో వికెట్‌గా పెవలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా(5)తో కలిసి అంబంటి రాయుడు(32 పరుగులు, 22 బంతులు, 3 ఫోర్లు, 1సిక్స్) ఆర్‌సీబీ బౌలర్లపై దాడి చేశారు. అయితే15.4 ఓవర్లో హర్షల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి అంబంటి రాయుడు వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని(11)తో కలిసి సురేష్ రైనా(17 పరుగులు, 10 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) చెన్నై టీంను విజయతీరాలకు చేర్చాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు, చాహల్, మాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు విరాట్ సేన టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో సీఎస్‌కే టీం ముందు 157 టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(53 పరుగులు, 41 బంతులు, 6 ఫోర్లు, సిక్స్), దేవదత్ పడిక్కల్ (70 పరుగులు, 50 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. షార్జాలో మైదానం చిన్నగా ఉండడంతో బౌండరీల మోత మోగించారు. ఇద్దరూ కలిసి ఓ దశలో అర్థ సెంచరీ కోసం బౌండరీలలో పోటీ పడ్డారు. అలాగే 140 పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు.
ఆర్‌సీబీ టీం 13.2ఓవర్లో కోహ్లీ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. డ్వేన్ బ్రావో వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా తరలించిన కోహ్లీ.. జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. దీంతో టీం స్కోర్ 111 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏబీ డివిలియర్స్(12) శార్దుల్ బౌలింగ్‌లో 16.5 ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆవెంటనే మరో బంతికి ఓపెనర్ పడిక్కల్ కూడా రాయుడికి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టిం డేవిడ్(1) కూడా త్వరగానే ఔటయ్యాడు.
అనంతరం డ్వేన్ బ్రావో వేసిన 20 ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 154 పరుగుల వద్ధ మాక్స్‌వెల్, 156 పరుగుల వద్ద హర్షల్ పటేల్ వికెట్లను కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, డ్వేన్ బ్రావో 3, చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.
Back to back wins for @ChennaiIPL! ? ?
A convincing victory for #CSK as they beat #RCB by 6⃣ wickets. ? ? #VIVOIPL #RCBvCSK
Scorecard ? https://t.co/2ivCYOWCBI pic.twitter.com/qKo58oFAJb
— IndianPremierLeague (@IPL) September 24, 2021
Also read: RCB vs CSK, IPL 2021: చెన్నై టీం టార్గెట్ 157.. అర్థ శతకాలతో రాణించిన విరాట్ కోహ్లీ, పడిక్కల్
PM Modi: మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?