AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఖడ్గమృగాలకు రక్షణ కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నందకు ధన్యవాదాలు తెలిపారు.

PM Modi: మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?
Pieterson Modi
Anil kumar poka
|

Updated on: Sep 24, 2021 | 7:00 PM

Share

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఖడ్గమృగాలకు రక్షణ కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నందకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకే భారత్ లో ఖడ్గమృగాల సంఖ్య పెరుగుతుందని పీటర్సన్ అన్నారు. ఖడ్గమృగాలను వేటగాళ్ల నుంచి రక్షించేందుకు అసోం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీఎం మోడీ చెప్పారు. ఖడ్గమృగాలకు రక్షణ కల్పించేందుకు అసోం సర్కారు తీసుకుంటున్న చర్యలను మోడీ ప్రశంసించారు. ఒక కొమ్ము ఖడ్గమృగాలు భరత్ కు గౌరవరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వాటిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రపంచ ఖడ్గమృగాల రోజైన సెప్టెంబర్ 22న అసోం ప్రభుత్వం 2,479 ఖడ్గమృగాల కొమ్ములను బహిరంగంగా కాల్చింది. అర్చకుల మంత్రల అనంతరం కొమ్ములను కాల్చారు. వేటగాళ్ల నుంచి ఖడ్గమృగాలను రక్షించే కార్యక్రమంలో భాగంగా కొమ్ములను కాల్చారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అసోం ఖడ్గమృగాల రక్షణకు కట్టుబడి ఉందని హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. మన దేశంలో అసోంలో ఖడ్గమృగాలు ఎక్కువగా ఉంటాయి. ఆసియా దేశాలైన చైనా, వియత్నంలో ఖడ్గమృగాల కొమ్ములను సంప్రదాయ ఔషధాల్లో వాడతారు. అందుకే వేటగాళ్లు ఖడ్గమృగాలను వేటడుతూ కొమ్ములు తీసుకుంటారు. 1977లో జరిగిన ప్రపంచస్థాయి సదస్సులో ఖడ్గమృగాల కొమ్ముల రవాణాను నిషేంధించారు. యానెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో అసోంలోని కాంజిరంగ జాతీయ పార్కును చేర్చింది. ప్రపంచంలో ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు ఎక్కువగా ఉన్న పార్కుగా కాంజిరంగ పార్కు గుర్తింపు పొందింది.

Read Also: Railway Track Facts: రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు.. కారణాలు ఏమిటో తెలుసుకోండి..!

‘మంత్రిగా పనికిరారు.. సినీ నటి కావచ్చు..’ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేపై కేసు