AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Track Facts: రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు.. కారణాలు ఏమిటో తెలుసుకోండి..!

Railway Track Facts: సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ట్రాక్‌పై ఏ మాత్రం కదలకుండా వెళ్తుంది. దీని వల్ల మనకు అలసట అనేది ఉండదు..

Railway Track Facts: రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు.. కారణాలు ఏమిటో తెలుసుకోండి..!
Subhash Goud
|

Updated on: Sep 24, 2021 | 6:17 PM

Share

Railway Track Facts: సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ట్రాక్‌పై ఏ మాత్రం కదలకుండా వెళ్తుంది. దీని వల్ల మనకు అలసట అనేది ఉండదు. కానీ రైల్వే విషయంలో కొన్ని విషయాలు అందరికి తెలియవు. రైలు వెళ్లే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి. ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తుండటంతో తుప్పు పడుతుంటుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే అనుమానం చాలా మందిలో రావచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రైలు పట్టాలు ఇనుముతో చేసేవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ.

ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి .. రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎలెప్పుడు పాలిష్ చేసిన మాదిరి మెరుస్తుంటాయి. అందుకే తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు. అలాగే రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు.

ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుంది..?

రైలు పట్టాలు తుప్పు పట్టకపోయినా..సాధారణం ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. తడిగా ఉన్నా, గాలిలో ఆక్సిజన్‌తో ప్రతిస్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుముపై గోధుమ రంగు ఐరన్‌ ఆక్సైడ్‌ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ గోధుమ రంగు పూత ఇనుము ఆక్సిజన్‌తో ప్రతిస్పందించి ఐరన్‌ ఆక్సైడ్‌ ఏర్పడుతుంది. దీని కారణంగా తుప్పు పడుతుంది. ఇది తేమ కారణంగా జరుగుతుంది.

ఇవీ కూడా చదవండి:

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్‌ మార్చితే వేగవంతం అవుతుంది..!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌