Lok Sabha Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లోక్‌సభ పీపీఆర్ విభాగంలో ఉద్యోగాలు.. జీతం రూ.65,000 వరకు..
పార్లమెంట్ ఆఫ్ ఇండియా పీపీఆర్ భాగం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పార్లమెంట్ ఆఫ్ ఇండియా పీపీఆర్ భాగం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వేర్వేరు విభాగాల్లో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్, జూనియర్ అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ లాంటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. లోక్‌సభ సచివాలయంలోని పీపీఆర్ వింగ్‌లో సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి ఒక ఏడాది కాంట్రాక్ట్‌తో భర్తీ చేస్తున్న పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కనొసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 11 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే దరఖాస్తుల్ని పోస్టులో పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు http://loksabhaph.nic.in/Recruitment/advandnot.aspx ను సందర్శించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పోస్ట్‌ల వారీగా ఖాళీలు ..
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్): 1 పోస్ట్
సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ కన్సల్టెంట్): 1 పోస్ట్
సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా ఎనలిస్ట్ (హిందీ): 1 పోస్ట్
జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ): 1 పోస్ట్
జూనియర్ కంటెంట్ రైటర్ (ఇంగ్లీష్): 1 పోస్ట్
సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్): 5 పోస్టులు
మేనేజర్ (ఈవెంట్స్): 1 పోస్ట్
విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఏడాదిపాటు కనీస పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలపై పోస్ట్ వారీగా వివరాల కోసం, దయచేసి అధికారిక నోటిఫికేషన్‌ని తనిఖీ చేయండి.
వయోపరిమితి: 22 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పే స్కేల్ (Pay scale): సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 65,000, సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ కన్సల్టెంట్)- రూ .35,000, సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్ (హిందీ)- రూ .45,000, జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)- రూ. 35,000, జూనియర్ కంటెంట్ రైటర్ (ఇంగ్లీష్)- రూ. 35,000, సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్)- రూ .30,000, మేనేజర్ (ఈవెంట్స్)- రూ .50,000.
అభ్యర్థులకు ఆరోగ్య బీమా ఉంటుంది. కానీ రవాణా, టెలిఫోన్ సౌకర్యాలు, నివాస వసతి పొందడానికి అర్హత ఇవ్వబడదు.
ఎలా దరఖాస్తు చేయాలి (How to apply): అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ఫార్మాట్‌లో పంపించాలి. “అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ -1, రూమ్ నెం. 619, లోక్‌సభ సెక్రటేరియట్, పార్లమెంట్ హౌస్ అనెక్స్, న్యూఢిల్లీ- 110001”. “ఈ ప్రకటన జారీ చేసిన తేదీ నుండి 21 రోజుల వ్యవధిలో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను పంపాలి అంటే దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 11.10.2021 గా లెక్కించబడుతుంది” అని లోక్ సభ నోటిఫికేషన్ పేర్కొనబడింది.
ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..