UPSC Results: విడుదలైన UPSC సివిల్ సర్వీస్ 2020 తుది ఫలితాలు.. సత్తాచాటిన తెలుగు తేజాలు..

దేశంలోనే అత్యున్న‌త‌స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్

UPSC Results: విడుదలైన UPSC సివిల్ సర్వీస్ 2020 తుది ఫలితాలు.. సత్తాచాటిన తెలుగు తేజాలు..
Upsc Rank
Follow us

|

Updated on: Sep 24, 2021 | 8:05 PM

దేశంలోనే అత్యున్న‌త‌స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుద‌ల చేసింది. 2020 మెయిన్స్‌కు సంబంధించిన తుది‌ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2020 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా.. 2021 ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ఇంట‌ర్వ్యూలో నెగ్గి మొత్తం  761 మంది అభ్యర్థులు స‌ర్వీసుల‌కు ఎంపికైన‌ట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్‌ ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్‌ నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్‌ పట్టా పుచ్చుకుంది.

విద్యార్థులు upsc.gov.in. వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జనరల్ కోటాలో 263 మంది విద్యార్థులకు చోటు లభించగా.. ఓబీసీ కోటాలో 86 మంది ఎంపికవగా.. ఇక ఎస్సీ, ఎస్టీ కోటాలో మొత్తం 122, 61 మంది విద్యార్థులు సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు.

సత్తాచాటిన తెలుగు తేజాలు..

తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్‌ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్‌ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకును దక్కించుకున్నారు.

ఈ లింక్ నుండి UPSC తుది ఫలితాలు..

దిగువ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాన్ని తనిఖీ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం…  UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు 2021 డైరెక్ట్ లింక్

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి…

Step 1: యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in కు వెల్లండి.

Step 2: హోమ్ పేజీలో కనిపించే ‘results’ ఆప్షన్‌ని క్లిక్ చేయండి.

Step 3: పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.ప్రిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించినవారి రూల్ నంబర్స్ మాత్రమే అందులో ఉంటాయి.

Step 4: ఫలితాలు క్రోనోలాజికల్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. మీ రూల్ నంబర్ కోసం స్కాన్ చేయండి లేదా ఫైండ్ ఆప్షన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోండి.

పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 10 న జరుగుతుంది

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల IAS, IFS నియామకాల ప్రిలిమ్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును జారీ చేసింది. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్ పరీక్ష అక్టోబర్ 10 న జరుగుతుంది. 19 సేవలకు పరీక్ష నిర్వహించారు. మొదటి ప్రిలిమ్ పరీక్ష జూన్ 27, 2021 న షెడ్యూల్ చేయబడింది. కానీ ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అది వాయిదా పడింది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గతంలో మాదిరిగానే జరిగింది. అభ్యర్థుల ఎంపిక కోసం మూడు దశల పరీక్ష నిర్వహించారు. మొదటిది ప్రిలిమ్ పరీక్ష, ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు రెండవ దశలో జరిగే ప్రధాన పరీక్షలో హాజరయ్యారు. అదే సమయంలో ప్రధాన పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచారు.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..