Intermediate Exams: అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రమోటై ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు. 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో ఒకట్రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండనున్నారు.
అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ, 29న ఫిజిక్స్, ఎకనామిక్స్, 30న కెమిస్ట్రీ, కామర్స్, నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..