AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘వామ్మో… ఇదేందయ్యా ఇది’.. విద్యుత్‌ కనెక్షన్‌ తీసివేసినా, రీడింగ్‌ తిరుగుతూనే ఉంది

ప్రజంట్ కరెంట్ బిల్లుల మోత ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ, రేపు  కరెంటు బిల్లు వస్తుందంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది.

Telangana: 'వామ్మో... ఇదేందయ్యా ఇది'.. విద్యుత్‌ కనెక్షన్‌ తీసివేసినా, రీడింగ్‌ తిరుగుతూనే ఉంది
Power Reading
Ram Naramaneni
|

Updated on: Sep 24, 2021 | 9:50 PM

Share

ప్రజంట్ కరెంట్ బిల్లుల మోత ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ, రేపు  కరెంటు బిల్లు వస్తుందంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది. బిల్లు కడుతుంటే సామాన్యుడికి కన్నీళ్లే తక్కువ. పెరిగిన చార్జీలతోటి వినియోగదారుల జేబులు గుళ్లవుతున్నాయి. గతంలో సాధారణ ఇళ్లకు రెండు మూడొందల బిల్లులు వచ్చేవి.   స్లాబ్‌ సిస్టం రావడంతో మోత మోగిపోతుంది. ఇన్ని యూనిట్లకు ఇంత చార్జి అని నిలబెట్టి వసూళ్లు చేస్తుంది కరెంటు డిపార్ట్‌మెంట్‌. మొన్నామధ్య పూరి గుడిసెకు కూడా లక్షల రూపాయల బిల్లు వచ్చింది. దాంతో లబొదిబొబంటూ విద్యుత్‌ ఆఫీసు వద్దకు ఉరుకులు పరుగులు పెట్టాడు సదరు వినియోగదారుడు. డిజిటల్‌ మీటర్లు వచ్చాక ఇటువంటి ప్రాబ్లమ్స్‌ అధికంగా వస్తున్నాయి. ఇక తాజాగా నిర్మల్‌ జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్‌ తీసివేసినా కూడా రీడింగ్‌ తిరుగుతూనే ఉంది.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని ఓ యజమాని విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విద్యుత్ కనెక్షన్ తొలగించి మీటర్‌ను చేతిలో పట్టుకున్నాక కూడా రీడింగ్‌ పెరుగుతూనే ఉంది. దీంతో అతడు కంగుతిన్నాడు. తక్షణమే మీటర్లు మార్చి కొత్త మీటర్లు పెట్టాలని కోరుతున్నారు.  ఇలాంటి మీటర్ల వల్ల విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్లతో ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Also Read: రావాలమ్మా రావాలి.. కరోనా వ్యాక్సిన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేయించుకోండమ్మా..

జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో

అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!