RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

RBI Scholarship: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ప్రకటించింది. నెలకు రూ.40 వేల చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందించనుంది..

RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2021 | 5:45 PM

RBI Scholarship: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ప్రకటించింది. నెలకు రూ.40 వేల చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందించనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా కాలేజీల్లో ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ స్కాలర్‌షిప్స్ పొందే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ మొత్తం 5 స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ద్రవ్య, ఆర్థిక శాస్త్రం లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్‌బీఐ సెంట్రల్ ఆఫీస్ లేదా రీజనల్ ఆఫీస్‌లో కొంతకాలం పరిశోధన చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌తో పాటు రీసెర్చ్ పేపర్ విజయవంతంగా పూర్తి చేసినవారికి రూ.1,50,000 పారితోషికం కూడా లభిస్తుంది.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు:

ఆర్‌బీఐ ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్‌ను పోస్టులో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. దరఖాస్తు ఫామ్ ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ నెలకు రూ.40వేల చొప్పున మూడు నెలలు లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2021. స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రారంభం డిసెంబర్ 6 నుంచి.

స్కాలర్‌షిప్‌కు అర్హతలు: ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దరఖాస్తు చేయాలి. వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు చేసుకోండిలా..

► అభ్యర్థులు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్స్‌లో Scholarships పైన క్లిక్ చేయాలి.

► Scholarship Scheme for Faculty Members from Academic Institutions: 2021 పైన క్లిక్ చేయాలి.

► Application పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

► తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

► ఆ తర్వాత పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ నింపాలి.

► రీసెర్చ్ ప్రపోజల్‌తో 1,000 కన్నా ఎక్కువ పదాలతో కరిక్యులమ్ విటే రూపొందించాలి.

► ప్రస్తుతం ఫ్యాకల్టీగా పనిచేస్తున్న యూనివర్సిటీ లేదా కాలేజ్ అఫీషియల్ లెటర్ జత చేయాలి.

► దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Director, Development Research Group, Department of Economic and Policy Research, 7th Floor, Central Office Building, Reserve Bank of India, Fort, Mumbai – 400001

ఇవీ కూడా చదవండి:

Income Tax Return: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఆలస్యమైనా పెనాల్టీ ఉండదు.. ఎవరికి అంటే..?

Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు