Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCRTC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. NCRTC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..?

NCRTC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ట్రైన్ ఆపరేటర్‌తో సహా

NCRTC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. NCRTC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..?
Job 2021
Follow us
uppula Raju

|

Updated on: Sep 24, 2021 | 9:56 AM

NCRTC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ట్రైన్ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు అధికారిక వెబ్‌సైట్ ncrtc.in లో ఉన్న నోటిఫికేషన్‌ని ఒక్కసారి పరిశీలించండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరితేది. NCRTC అనేది భారత ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, UPల మధ్య జాయింట్ వెంచర్. ఇది గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.

పోస్టుల ప్రకారం అర్హత

1. మెయింటెనెన్స్ అసోసియేట్ (మెకానికల్) – మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా 2. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా 3. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రానిక్స్) – ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా 4. మెయింటెనెన్స్ అసోసియేట్ (సివిల్) – సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా 5. ప్రోగ్రామింగ్ అసోసియేట్ – కంప్యూటర్ సైన్స్/IT లేదా BCA లేదా BSc ITలో మూడేళ్ల డిప్లొమా 6. ఎలక్ట్రీషియన్ – ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటిఐ 7. ఎలక్ట్రానిక్ మెకానిక్ – ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ITI 8. టెక్నీషియన్ ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్ – ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్ ట్రేడ్‌లో ITI 9. ఫిట్టర్ – ఫిట్టర్ ట్రేడ్‌లో ITI 10. వెల్డర్ – వెల్డింగ్ ట్రేడ్‌లో ITI 11. స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా దానికి సమానమైన లేదా B.Sc ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్‌తో.

వయస్సు పరిధి

ఈ ఖాళీల కింద ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్, ఫిట్టర్ & వెల్డర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. మిగిలిన అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. పూర్తి ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ని తనిఖీ చేయండి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ ncrtc.in లో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Rambha : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రంభ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు..

Crime News: మద్యప్రదేశ్‌లో దారుణం..! కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికిన దుండగులు..

AP MPP Elections: ఇవాళ ఏపీలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు.. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌