Crime News: మద్యప్రదేశ్‌లో దారుణం..! కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికిన దుండగులు..
Crime News: మధ్యప్రదేశ్‌లోని ఎక్లారా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రతన్‌బాయి అనే ఏళ్ల వృద్ధురాలిపై కొంతమంది దుండగులు దాడి
Crime News: మధ్యప్రదేశ్‌లోని ఎక్లారా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రతన్‌బాయి అనే ఏళ్ల వృద్ధురాలిపై కొంతమంది దుండగులు దాడి చేసి పదునైన ఆయుధంతో ఆమె కాళ్లు నరికివేశారు. స్థానికంగా ఈ ఘటన అందరిని భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు వృద్దురాలు ఒంటరిగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రతన్ బాయి అనే మహిళ పొలంలో కలుపు తీసేందుకు తన ఇంటి నుంచి కొంత దూరం వెళ్లింది. ఇంతలో కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేశారు. పదునైన ఆయుధంతో ఆమె కాళ్లు నరికివేసి కడియాలు, ఇతర బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సమయంలో వృద్దురాలు వారితో చాలా పోరాడినట్లు తెలుస్తోంది. ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాళ్లు నరికివేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సాయంత్రం 5 గంటలకు జరిగినట్లు చెబుతున్నారు.
మహిళ కాళ్లు నరికివేశారని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆ ప్రదేశంలో ఎలాంటి క్లూ దొరకలేదు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ తన బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.