AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs CSK IPL 2021 Match Prediction: ధోనిసేనతో ఢీ కొట్టనున్న కోహ్లీ టీం.. పేలవమైన రికార్డును చెరిపేసేందుకు ఆర్‌సీబీ తంటాలు..!

Today Match Prediction of Royal Challengers Bangalore vs Chennai Super Kings: ఐపీఎల్ 2021లో భాగంగా 35 వ మ్యాచులో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తలపడనుంది.

RCB vs CSK IPL 2021 Match Prediction: ధోనిసేనతో ఢీ కొట్టనున్న కోహ్లీ టీం.. పేలవమైన రికార్డును చెరిపేసేందుకు ఆర్‌సీబీ తంటాలు..!
Rcb Vs Csk Ipl 2021
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 24, 2021 | 10:52 AM

Share

IPL 2021, RCB vs CSK: ఐపీఎల్ 2021లో భాగంగా 35 వ మ్యాచులో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది. విరాట్ కోహ్లీ సేన ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడి ఐదు విజయాలతో మూడవ స్థానంలో నిలిచింది. ధోని సేన ఎనిమిది మ్యాచులో 6 విజయాలు సాధించి, రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2021 రెండవ దశలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ ఓటమితో తన ఆటను ప్రారంభించింది. ఇప్పటి వరకైతే కోహ్లీ సేన సురక్షితంగానే ఉంది. అయితే రన్‌రేట్ మాత్రం -0.706 గా ఉంది. యూఏఈలో ఇప్పుడు జరిగే మూడు వేదికలలో కంటే షార్జ మైదానం చాలా చిన్నది.

ఎప్పుడు: RCB vs CSK, సెప్టెంబర్ 24, 2021, రాత్రి 7:30 గంటలకు

ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం

లైవ్ ఎక్కడ, ఎలా చూడాలి: ఐపీఎల్ మ్యాచులన్నీ డిస్నీ హాట్ యాప్‌లో చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

పిచ్: షార్జా మైదానం చాలా చిన్నది. దీంతో బౌండరీల మోత మోగనుంది. బౌలర్లకు మాత్రం చుక్కలు కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఏడు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌లు నమోదయ్యాయి. మొదటి ఆరు ఆటలలో ఐదు జట్లు మొదట బ్యాటింగ్ చేసినవే గెలిచాయి.

హెడ్ ​​టు హెడ్: చెన్నై సూపర్ కింగ్స్ టీం రాయల్స్ చాలెంజర్స్ టీంలు ఇప్పటి వరకు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచుల్లో చెన్నై టీం గెలిచింది. ఆర్‌సీబీ టీం 9 మ్యాచులు గెలిచింది. ఈ రెండు టీంల మధ్య జరిగిన చివరి 11 ఎన్‌కౌంటర్లలో సీఎస్‌కే టీం 9 మ్యాచుల్లో గెలిచింది. వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచులో రవీంద్ర జడేజా వన్ మ్యాన్ షో చేశాడు. హర్షల్ పటేల్ ఓవర్‌లో 28 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే బంతితో 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఒక రనౌట్ కూడా చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాయాలు/ క్వారంటైన్: లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జార్జ్ గార్టన్ ఇంకా క్వారంటైన్‌లో ఉన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌ ఎంపికలో అందుబాటులో ఉండడు.

కోల్‌కతా టీంతో జరిగిన రెండో దశ తొలి మ్యాచులో ఆర్‌సీబీ టీం దారుణ పరాజయాన్ని చవిచూసింది. టీం మొత్తం కేవలం సీజన్‌లోనే అతి తక్కువ మొత్తం అంటే 92 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీం బ్యాటింగ్‌పై పలు లోపాలను ఎత్తి చూపినట్లు తెలుస్తోంది. ఒక్క పడిక్కల్ మాత్రమే 20 పరుగులు దాటాడు. మిగతావారు రాణించలేక కేకేఆర్ బౌలింగ్‌ ముందు డీలా పడ్డారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కేఎస్ భరత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, టిమ్ డేవిడ్/వనిందు హసరంగ, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ గాయాలు/అందుబాటులో: సామ్ కుర్రాన్ తన ఆరు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేశాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో అందుబాటులో ఉన్నాడు. సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, అంబటి రాయుడు ముంజేయికి తగిలిన దెబ్బ పెద్ద గాయం కాలేదని తెలిసింది. అయితే ఈ మ్యాచులో ఆడేది లేనిది మాత్రం తెలియదు. కుర్రాన్ ఎంపికకు అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్‌కే డ్వేన్ బ్రావోనే కొనసాగించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ టీంతో తొలి మ్యాచులో అద్భుత విజయాన్ని సాధించి, మంచి ఫాంలో ఉంది. రుతిరాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్‌తో టీం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో టీం మరోసారి తన నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & కీపర్), డ్వేన్ బ్రావో/సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

మీకు తెలుసా? – హర్షల్ పటేల్ 13 బంతుల్లో రెండుసార్లు ఫాఫ్ డు ప్లెసిస్‌ని, అంబటి రాయుడుని 36 బంతుల్లో నాలుగు సార్లు పెవిలియన్ పంపాడు.

– డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో 98 బంతుల్లో విరాట్ కోహ్లీ 151 పరుగులు చేశాడు.

– ఎంఎస్ ధోనీ ఆర్‌సీబీకి వ్యతిరేకంగా 141.50 స్రైక్ రేట్ వద్ద 824 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా అత్యధిక స్కోరు చేశాడు.

టీంలు: చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (డబ్ల్యు/సి), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్, సామ్ కర్రాన్, రాబిన్ ఉతప్ప, చేతేశ్వర్ పూజారా, కర్ణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, జాసన్ బెహ్రెండార్ఫ్, కృష్ణప్ప గౌతమ్, లుంగీ ఎన్‌గిడి, మిచెల్ సాంట్నర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, హరి నిశాంత్, ఎన్ జగదీసన్, KM ఆసిఫ్, హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్: విరాట్ కోహ్లి (సి), దేవదత్ పాడికల్, శ్రీకర్ భరత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, వనిందు హసరంగ, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, సచిన్ బేబీ, డానియల్ క్రిస్టియన్ , దుష్మంత చమీరా, పవన్ దేశ్ పాండే, రజత్ పటీదార్, మహ్మద్ అజారుద్దీన్, జార్జ్ గార్టన్, సుయాష్ ప్రభుదేసాయ్, టిమ్ డేవిడ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్

Also Read:

IPL 2021: రోహిత్‌కు ఏమైంది.? దిగజారిన ముంబై.. టాప్ ప్లేస్‌కు గురి పెట్టిన చెన్నై..! పూర్తి వివరాలు

IPL 2021, MI vs KKR Match Result: ముంబయిపై కోల్‌కతా టీం అద్భుత విజయం.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న అయ్యర్, త్రిపాఠి