వీరి దోపిడీలకి చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వీడియో

వీరి దోపిడీలకి చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 24, 2021 | 9:33 AM

మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు.... స్వయం సహాయక సంఘాలకు సాయం పేరుతో మోసాలకు తెగబడ్డారు.

మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు…. స్వయం సహాయక సంఘాలకు సాయం పేరుతో మోసాలకు తెగబడ్డారు. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్ గా ఓ ముఠా నయా దోపిడీ మొదలు పెట్టింది.. సెంథిల్, కుమార్, రాజ్ కుమార్, సంగీతలు అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా కేంద్రంలో మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం పట్టణంలోనే ఉన్నట్లు తప్పుడు చిరునామాతో బురిడీ కొట్టించారు. జిల్లాలోని శ్రీకాళహస్తీ, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేదలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపుకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికారు. ఇలా, శ్రీకాశహస్తీ, సత్యవేడు మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలు పంచి, మహిళలను నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక గ్రూప్ నుండి 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే దివ్య ఔషధం.. ఇది ఒక్క సారి తీసుకుంటే ఇంకా అంతే..!! వీడియో

Viral Video: కారు ఎక్కబోయిన మహిళ.. ఒక్కసారిగా భయంతో పరుగులు.. అసలు ఏమైందంటే..?? వీడియో