AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!

Amazon Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా..

Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!
Subhash Goud
|

Updated on: Sep 22, 2021 | 7:00 PM

Share

Amazon Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమే. ఇక తాజాగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపికైన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తోంది అమెజాన్.  అప్లికేషన్ లింక్‌ పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీష్‌ భాషపై పట్టు ఉండాలి. అలాగే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7 షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం ఉద్యోగి బాధ్యతే. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్‌లో సంస్థకు అందుబాటులో ఉండాలా చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు పరీక్ష నిర్వహించిన తర్వాత సంస్థ ఒకే అనుకుంటే ఎంపికైన అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఇవీ కూడా చదవండి:

Covid-19 – CBSE: ఎలాంటి ఫీజు లేదు.. విద్యార్థులకు శుభవార్త.. బోర్డ్‌ పరీక్షపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన..!

Indian Railways Jobs: ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాలు.. 3093 అప్రెంటిస్‌ జాబ్స్‌.. అర్హతలు.. ఇతర వివరాలు..!