UPSC Recruitment: యూపీఎస్సీ – ఇండియన్‌ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పరీక్ష నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు..

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగం సాధించాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసమే యూపీఎస్సీ తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా..

UPSC Recruitment: యూపీఎస్సీ - ఇండియన్‌ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పరీక్ష నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2021 | 6:39 AM

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగం సాధించాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసమే యూపీఎస్సీ తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పరీక్ష 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇందులో సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. * అభ్యర్థులు వయసు 01-01-2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ఇంజనీరింగ్ సర్వీసెస్‌ – ప్రిలిమ్స్‌, ఇంజనీరింగ్ సర్వీసెస్‌ – మెయిన్స్‌ పరీక్షను నిర్వహించి. అనంతరం ఇందులో ఎంపికైన వారికి పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరులు మాత్రం రూ. 200 చెల్లించాలి. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 22-09-2021న ప్రారంభమవగా.. చివరి తేదీగతా 12-10-2021ని నిర్ణయించారు. * ఇంజనీరింగ్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను 20-02-2022లో నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!

SBI Clerk Prelims Results 2021: ఎస్‌బిఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.