SBI Clerk Prelims Results 2021: ఎస్‌బిఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
SBI Clerk Prelims Results 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు ఎస్‌బిఐ క్లర్క్ ఉద్యోగ నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాను ప్రకటించింది.
SBI Clerk Prelims Results 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు ఎస్‌బిఐ క్లర్క్ ఉద్యోగ నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాను ప్రకటించింది. జూనియర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను ఎస్‌బిఐ జూలై, ఆగస్టు నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ తాజాగా విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను, మెరిట్ లిస్ట్‌ను ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం ఏప్రిల్ 27 నుండి మే 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్, ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ కింది స్టె్ప్స్ ఫాలో అవ్వండి.
ఎస్‌బిఐ క్లర్క్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే.. 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను సందర్శించాలి. 2. హోమ్‌పేజీకి వెళ్లాక అక్కడ ఉన్న ‘కెరీర్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా కెరీర్ ఆప్షన్ క్లిక్ చేయగా.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 3. అక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయాలి. 4. మీ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా లాగిన్ అవ్వాలి. 5. ఎగ్జామ్ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. 6. దానిని పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
త్వరలో మెయిన్స్ షెడ్యూల్ ప్రకటన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే మెయిన్స్ ఎగ్జామ్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీ, సమయం, వేదిక వంటి సమాచారాన్ని విడుదల చేయనుంది. ఇక మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ టెస్ట్, లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఇంటర్వ్యూ రౌండ్‌కు ముందు జరుగుతుంది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం, ఎస్‌బిఐ క్లర్క్ రిజల్ట్ డౌన్‌లోడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్(sbi.co.in)ను ఫాలో అవ్వండి.
Also read:
హీరోయిన్ పై యాసిడ్ దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.. తృటిలో తపించుకున్న పాయల్..
Viral Video: వీడి క్రేజ్ తగలెయ్యా.. నెలల తరబడి డైపర్‌లతోనే.. వీడియో