CBSE CTET 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే..

CBSE CTET 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ఒక ప్రకటన విడుదల చేసింది.

CBSE CTET 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే..
Ctet
Follow us

|

Updated on: Sep 22, 2021 | 9:36 AM

CBSE CTET 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ఒక ప్రకటన విడుదల చేసింది. సీటెట్ పరీక్షను డిసెంబర్ 16 నుంచి జనవరి 13వ తేదీల మధ్యలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల బోధనకు ఉపాధ్యాయుల అర్హత కోసం ఈ పరీక్షను ప్రతీ ఏటా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, సీటెట్ రిజిస్ట్రేషన్స్‌ లాస్ట్ డేట్‌గా అక్టోబర్ 19 ని నిర్ణయించారు.

సీటెట్ పరీక్షా విధానం.. సీటెట్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1.. 1 నుంచి 5 తరగతులకు బోధించే టీచర్లకు, పేపర్-2.. 6 నుంచి 8 తరగతులకు టీచర్ కావాలనుకునే వారికి ఉంటుంది. రెండూ కావాలనే అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. సీటెట్ లో ఉత్తీర్ణత సాధిస్తే సదరు సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. పేపర్-1: ఈ పేపర్‌లో పిల్లల అభివృద్ధి, బోధన, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, పర్యావరణ అధ్యయనాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2: ఈ పేపర్‌లో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి.

ఈ పరీక్షల కోసం అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి వరకు ఎన్‌సీఆర్టీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. తద్వారా సబ్జెక్టుపై గ్రిప్ వస్తుంది. అలాగే, చైల్డ్ డెవలప్‌మెంట్, బోధనా శాస్త్రం, టీచింగ్, లెర్నింగ్, మనస్తత్వశాస్త్రం, అభ్యాసకుల లక్షణాలు, అవసరాలు, కమ్యూనికేషన్, విద్యార్థుల గ్రహణ సామర్థ్యాలు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్, సమస్య పరిష్కార సామర్థ్యాలు, బోధానపరమైన అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాల్సి ఉంటుంది.

Also read:

SAARC: తాలిబాన్ ప్రాతినిధ్యం కోసం పాకిస్తాన్ పట్టుదల.. వ్యతిరేకించిన భారత్.. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా!

AP ECET Answer Key 2021: ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం..

ఎలక్ట్రానిక్‌ వాహనదారులకు గుడ్ న్యూస్‌..! ఈ కంపెనీ నుంచి 10 వేల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు