AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAARC: తాలిబాన్ ప్రాతినిధ్యం కోసం పాకిస్తాన్ పట్టుదల.. వ్యతిరేకించిన భారత్.. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా!

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 25 న జరగాల్సి ఉంది. అయితే దీనిని ఇప్పుడు రద్దు చేశారు. పాకిస్తాన్ తాలిబన్ జపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

SAARC: తాలిబాన్ ప్రాతినిధ్యం కోసం పాకిస్తాన్ పట్టుదల.. వ్యతిరేకించిన భారత్.. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా!
Afghanistan Crisis Copy
KVD Varma
|

Updated on: Sep 22, 2021 | 9:34 AM

Share

SAARC: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 25 న జరగాల్సి ఉంది. అయితే దీనిని ఇప్పుడు రద్దు చేశారు. పాకిస్తాన్ తాలిబన్ జపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తాలిబాన్ నాయకుడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధిగా చేర్చాలని పాకిస్తాన్ పట్టు బట్టింది. అయితే భారత్‌తో సహా ఇతర సభ్య దేశాలు దీనిని వ్యతిరేకించాయి. అటువంటి పరిస్థితిలో, ఏకాభిప్రాయం లేకపోవడంతో సమావేశం రద్దు చేసినట్టు ANI వార్తాసంస్థ వెల్లడించింది.

సార్క్ సభ్యులలో చాలామంది ఈ సమావేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ కుర్చీని ఖాళీగా ఉంచాలని కోరుకున్నారు. అయితే ఈ సమావేశంలో తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని పాకిస్తాన్ పట్టుదలగా ఉంది. వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన దేశాలు ఇంకా గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతకీతో సహా అనేక మంది మంత్రులను బ్లాక్‌లిస్ట్ చేసింది. అటువంటి పరిస్థితిలో, ముతక్కి ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేరు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత వారం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో తన వర్చువల్ ప్రసంగంలో, తీవ్రవాదం అనేక సమస్యలకు మూలం. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమి జరిగిందో దాని ఫలితమని చెప్పారు. తాలిబాన్ల సమ్మిళిత ప్రభుత్వాన్ని గుర్తించే ముందు ప్రపంచం ఆలోచించాలని కూడా ఆయన అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలను చేర్చలేదు.

సార్క్ 8 దేశాల సంస్థ..

సార్క్ అనేది దక్షిణాసియాలోని 8 దేశాల ప్రాంతీయ సంస్థ. ఇందులో భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. 8 డిసెంబర్ 1985 న ఏర్పడిన ఈ సంస్థ ఉద్దేశ్యం, పరస్పర సహకారం ద్వారా దక్షిణ ఆసియాలో శాంతి, పురోగతికి మార్గాలను కనుగొనడం.

తాలిబాన్లకు పాకిస్తాన్ సహాయం చేస్తోంది

పాకిస్తాన్ తాలిబన్లతో పాత సంబంధాన్ని కలిగి ఉంది. అది తాలిబాన్లకు సహాయం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆక్రమణలో పాకిస్తాన్ హస్తం కూడా ఉన్నట్లు ప్రపంచం అంతా తెలిసిన విషయమే. అదే సమయంలో, పంజ్‌షీర్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం తాలిబన్‌లకు సహాయం చేసిన నివేదికలు కూడా తెరపైకి వచ్చాయి. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా పాకిస్తాన్ నేరుగా జోక్యం చేసుకుంది. తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించడానికి ముందు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI చీఫ్, ఫైజ్ హమీద్ కాబూల్ వెళ్లారు. అతని జోక్యంతో, ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ నాయకులు తాలిబాన్ ప్రభుత్వంలో చేరడం జరిగిందనేది బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో సార్క్ సమావేశాల్లో తాలిబాన్ ప్రాతినిధ్యం ఉండాలంటూ పాకిస్తాన్ పట్టుబట్టడం పెద్దగా ఆశ్చర్యం అనిపించే విషయం కాదు.

Also Read: China’s Evergrande Crisis: ప్రపంచంపై చైనా మరో బాంబు? పలు దేశాలను ఆర్థికంగా ముంచబోతోందా?

Russia Elections: మరోసారి సత్తా చాటిన వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘డ్యూమా’కు జరిగిన ఎన్నికల్లో ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం