Covishield Vaccine: అమెరికా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక, కోవిషీల్డ్ తీసుకున్నవారికి అనుమతి

Covishield Vaccine: అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా అనుమతించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

Covishield Vaccine: అమెరికా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక, కోవిషీల్డ్ తీసుకున్నవారికి అనుమతి
Covishield Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 22, 2021 | 7:35 AM

Covid 19 Vaccine: అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా అనుమతించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనకు లోబడి భారత్‌ సహా 33 దేశాలకు చెందినవారిని తమ దేశంలోకి రావవచ్చని తెలిపింది. అయితే, మన దేశంలో తయారైన టీకాలను తీసుకున్న వారిని కాదని, ప్రత్యేకంగా నిర్ధారించిన వ్యాక్సిన్స్ తీసుకున్నవారిని మాత్రమే అనుమతించారు. తాజాగా కోవిషీల్డ్‌ తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ఆ తర్వాత శ్వేత సౌథం మరో ప్రకటన చేస్తూ… ఏ టీకా ఆమోదయోగ్యమో తుది నిర్ణయం తీసుకొనేది తమ దేశ ‘వ్యాధుల నియంత్రణ కేంద్రం’ (సీడీసీ) మాత్రమేనని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పటి వరకు ఏడు టీకాలను మాత్రమే గుర్తించింది. వాటిలో మోడెర్నా, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్‌(ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఫార్ములా), చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ టీకాలు ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు ఈ నెలలో డబ్ల్యూహెచ్‌వో అమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, వచ్చే నెలలో సుమారు 22 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ నివేదించింది.

ఇదిలావుంటే, బ్రిటన్ ప్రభుత్వం ప్రయాణికులకు కొత్త కోవిడ్ సంబంధిత ఆంక్షలను ప్రకటించడంపై వివాదం నెలకొంది. దీనిమీద విదేశాంగ కార్యదర్శి హర్ష్ శృంగ్లా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూకే కోవిషీల్డ్.. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను గుర్తించకపోవడం వివక్షాత్మకమైన విధానమని అన్నారు. ఇది UK కి వెళ్లాలనుకునే భారతీయులపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “యూకే కొత్త విదేశాంగ కార్యదర్శితో EAM సమస్యను బలంగా లేవనెత్తింది. ఈ సమస్య పరిష్కరించబడుతుందని కొన్ని హామీలు ఇచ్చారని నాకు తెలిసింది” అని విదేశాంగ శాఖ తెలియజేసింది. అంతకు ముందు రోజు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కోవిడ్ -19 క్వారంటైన్ సమస్యను ‘ముందుగానే పరిష్కరించాలని’ కోరారు.

కొత్త నిబంధనల ప్రకారం, కోవిషీల్డ్ రెండు మోతాదులు వేసుకున్న భారతీయ ప్రయాణికులు టీకాలు తీసుకోనివారిగానే పరిగణించనున్నారు. అయితే, కోవిషీల్డ్ పొందిన వారందరినీ కూడా 10 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు, భారత అధికారులు జారీ చేసిన COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేషన్ గుర్తింపును ఎలా విస్తరించవచ్చో అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నామని UK తెలిపింది.

ఇదిలా ఉండగా, కోవిడ్ -19 కు రెండు టీకాలు పూర్తైన భారత్‌తో సహా 33 దేశాలకు చెందిన విమాన ప్రయాణికులకు అమెరికా నవంబర్‌లో తిరిగి దేశంలోకి అనుమతించనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ చర్య వల్ల ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, గ్రీస్, అలాగే బ్రిటన్, ఐర్లాండ్, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,బ్రెజిల్ తో సహా యూరప్‌లోని 26 స్కెంజెన్ దేశాల నుండి వ్యాక్సినేషన్ పూర్తైన విమాన ప్రయాణికులను అనుమతి లభిస్తుంది. ఈ ఆంక్షలు గత 14 రోజులుగా ఈ దేశాల్లో ఉన్న యూఎస్ యేతర పౌరులకు నిషేధించబడ్డాయి.

Read Also….  RRR News: మార్కెట్లోకి ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీషర్ట్‌లు, మాస్కులు వచ్చేశాయ్‌ చూశారా.? ఎలా కొనుగోలు చేయాలంటే..